TEJA NEWS

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో “నో వెహికల్ డే” బేఖాతరు
-కార్లు బైకులతో కళాశాల ప్రాంగణంలో రైడ్, స్టంట్లు
-పట్టించుకోని ప్రిన్సిపల్, సిబ్బంది


రాజమహేంద్రవరం, : స్థానిక ఆర్ట్స్ కళాశాలలో ప్రతినెలలో వచ్చే 2, 4వ రోజుల్లో కళాశాల ప్రాంగణంలో ఎటువంటి ఇంధన వాహనాలు (నో వెహికల్ డే) కళాశాల ప్రాంగణంలోకి అనుమతించబడవని, ప్రైవేటు వ్యక్తుల వాహనాలు, కళాశాల ఉద్యోగులు, విద్యార్థుల వాహనాలు సైతం కళాశాల కాంపౌండ్ అవతల పార్కింగ్ ఏరియాలలో నిలుదల చేసి కళాశాల ప్రాంగణంలోకి రావాలని, ఈ ఆంక్షలు అతిక్రమించరాదని కళాశాల ప్రిన్సిపాల్ కె. రామచంద్రరావు గతంలో పేర్కొన్నారు.
ఈ విషయమై తెలుగు రచయిత, అవధాని, ఉపన్యాసకుడు గరికపాటి నరసింహారావు కూడా ఈ కళాశాలకు వచ్చి కళాశాల ప్రిన్సిపాల్ మరియు సిబ్బందిని కూడా అభినందనలు తెలిపారు. రాను రాను ఈ ఆంక్షలు కేవలం విద్యార్థులు, సిబ్బందికే పరిమితమైందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈనెల 24,25 తేదీల్లో వాహన ఆటో ఎక్స్పో నిర్వహించుకునేందుకు కళాశాల ప్రాంగణంలో అనుమతి పొందిన నిర్వాహకులు ఈ ఆంక్షలు బేఖాతరు చేస్తూ ఈరోజు 23న (శుక్రవారం) కళాశాల ప్రాంగణంలో బైకులు, కార్లతో రైడ్, స్టంట్లు చేయడాన్ని పలువూరు తీవ్రంగా విమర్శించారు. కళాశాల యాజమాన్యం ఆటో ఎక్స్పో నిర్వహించుకునే నిర్వాహకులకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం వల్లే వారు ఈ అంశాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుంది. విద్యార్థులు మరియు స్థానికులు ఈ వ్యవహారం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ ఆటో ఎక్స్ఫో నిర్వహిస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి.


TEJA NEWS