TEJA NEWS

కాకాణి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయ ప్రారంభం”

SPS నెల్లూరు జిల్లా:

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని నెల్లూరు నగరంలోని డైకస్ రోడ్డు సెంటర్, సాయిరాం నగర్ లో మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీనియర్ నాయకుల చేతుల మీదుగా ప్రారంభం.

అట్టహాసంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి భారీగా తరలివచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మగారు, శాసనమండలి సభ్యులు పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి , మేరిగ మురళీధర్ , మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య , రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , వెంకటగిరి నియోజకవర్గ ఇంచార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి , నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి , మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఖలీల్ అహ్మద్ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి , విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి , ఏపీ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ చిల్లకూరు సుధీర్ రెడ్డి , మాజీ నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి , జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, మండల కన్వీనర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, జెడ్పిటిసి సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తదితరులు.

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా, భారీగా విచ్చేసి జయప్రదం చేసిన నాయకులకు, కార్యకర్తలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు పేరుపేరున ధన్యవాదాలు తెలియజేసిన డా౹౹కాకాణి గోవర్ధన్ రెడ్డి .


TEJA NEWS