TEJA NEWS

పలాస జీడిపప్పుకి.. ఇక మహా ప్రసాదం

తిరుమల లడ్డూ ప్రసాదానికి ఇక నుంచి పలాస జీడిపప్పుతొలిసారి బిడ్ దక్కించుకున్న పలాస వ్యాపారి కోరాడ సంతోష్

రోజుకు 3 టన్నులు జీడిపప్పు సరఫరాకు ఒప్పందం

పలాస : తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్లు దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట గ్లోబల్ విధానంలో టెండర్లు పిలిచారని అన్నారు. ఇందులో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వండలాది మంది వ్యాపారులు పోటీ పడ్డారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు మూడు టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూల తయారీకి అవసరం అవుతుందన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డు తయారికి పలాస జీడిపప్పు సరఫరా అయిందని, మళ్ళీ ఇప్పుడు మనకు అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS