పవన్ కల్యాణ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి
13వ డివిజన్‌లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు
దానవాయిబాబు ఆలయంలో 108 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు
రాజమహేంద్రవరం :
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని పలువురు పవన్ కల్యాణ్ అభిమానులు ఆకాంక్షించారు. స్థానిక 13వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దానవాయిబాబు ఆలయంలో పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, డివిజన్ జనసేన పార్టీ జన సైనికుడు బుర్రే శ్రీనివాస్ (ఫ్లక్స్‌ల వాసు), టీడీపీ నాయకులు బొర్రా చిన్నిబాబు, మస్తాన్ చౌదరి, రాయి అప్పన్న బాబు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నగర అధ్యక్షులు వై దేవీప్రసాద్ తదితులు స్వామి వారికి పాలాభిషేకం చేసి, 108 కొబ్బరి కాయలు కొట్టారు. అనంతరం బుర్రే శ్రీనివాస్, బొర్రా చిన్ని మాట్లాడుతూ పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురష్కరించుకుని ప్రతి ఏటా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే వారమని, అయితే ఈ ఏడాది ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడలో చోటు చేసుకున్న ఘటన నేపధ్యంలో నిరాడంబరంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. పవన్ కల్యాణ్ కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిన్ని, శివ, రామకృష్ణ, కొండ, బత్తిన భాస్కర్, అధిక సంఖ్యలో పవన్ కల్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.
పవన్ కల్యాణ్ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలి
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
TEJA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
TEJA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…