TEJA NEWS

గోదావరి పరివాహక మరియు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ధర్మపురి

ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్,అధికారులు మరియు పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగింది

ఏ అవసరం ఉన్న మా దృష్టికి తీసుకురండి ఏళ్ల వేళలా సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం..

ఎండపెల్లి మండలంలోని రాజరాంపల్లి పాతగూడుర్ గ్రామాలకు మధ్య గల వంతెనను సోమవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మండల నాయకులు అధికారులతో కలిసి పరిశీలించారు.

కార్యక్రమానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీ.శే డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారి 15 వ వర్ధంతి సందర్భంగా ఎండపెల్లి మండలం రాజరాంపల్లి లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వెల్గటూర్ మండలం పాశిగామ గ్రామంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించి స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించి నిర్వాసితులతో మాట్లాడారు.

ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ..

గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రాజరాంపల్లి పాతగూడూర్ గ్రామాల మధ్య గల పాత వంతెన మొత్తం మునిగిపోవడం జరిగిందని,కొత్త వంతెన 90 శాతం పూర్తి అయినప్పటికీ విద్యుత్ వైర్ల వలన రాకపోకలకు ఆటంకం కలుగుతుందని దీని గురించి విద్యుత్ ఉన్నతాధికారులతో మాట్లాడటం జరిగిందని వెంటనే సమస్యను పరిష్కరిస్తామని,కడెం ప్రాజెక్ట్ నుండి కూడా నీటిని విడుదల చేయడం వల్ల గోదావరిలోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుందని కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని,ముఖ్యంగా శిథిలావస్థలో ఉండి కూలిపోయే స్థితిలో ఉన్న ఇళ్లలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలనీ, వాగులు చెరువులకు నీరు చేరె అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించడం జరిగిందని,పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు అన్ని వసతులు కల్పించాలని,ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని,వరదల వల్ల గ్రామాల్లో చాలా రోడ్లు దెబ్బతినడం జరిగిందని,వాటికి కూడా తాత్కాలికంగా మరమత్తులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని,విద్యుత్తు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్ పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని,ప్రజలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్,అధికారులు,పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగిందని,ఎవరికి ఎటువంటి సహాయం అవసరం ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని,ఏళ్ల వేళలా సహాయం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS