TEJA NEWS

ఉమ్మడి ఖమ్మం

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం పురస్కారించుకొని ఖమ్మం నగరంలోని కాల్వవోడ్ధు మున్నేరు వద్ద జరిగే నిమజ్జనం ప్రాంతాన్ని నగరపాలక కమిషనర్ అభిషేక్ అగస్త్య, నగర మేయర్ నిరజా, సంభాధ్రి ఉత్సవ కమిటీ వారితో కలసి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు. శోభాయాత్ర, నిమజ్జన సమయాలలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రహదారిపై అడ్డుగా వైర్లు, చెట్టు కొమ్మలు లేకుండా చొరవ తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, మార్గాలు, బారికేడింగ్ తదితర అంశాలపై చర్చించారు. ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు వుండాలని, సీసీ కెమెరాలను కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం అయ్యేలా చూసుకొవాలని సూచించారు. మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్‌, పోలీసులతో పాటు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా శోభాయాత్ర, నిమజ్జనం జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో సహకరించుకోవాని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ నరేష్ కుమార్, అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాద్ రావు, ఏసీపీ రమణమూర్తి ఇన్స్‌పెక్టర్ రమేష్, మోహన్ బాబు, సాంబశివరావు, సంభాధ్రి ఉత్సవ కమిటీ విద్యాసాగర్, వినోద్ లహౌటి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS