చత్తీస్ ఘడ్ :
భారీ ఎన్‌కౌంటర్ తర్వాత ఛత్తీస్‌గడ్ బస్తర్ అడవుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. టెన్షన్ సిచ్యువే షన్స్ కంటిన్యూ అవుతు న్నాయి. టెన్షన్..టెన్షన్..ఏ క్షణంలో ఏం జరుగుతుం దోనన్న ఆందోళన కొనసాగుతోంది.
ఎన్‌కౌంటర్ తర్వాత కూడా భద్రతాబలగాల కూంబింగ్ కొనసాగుతోంది. బస్తర్ అడవులను జల్లడ పడు తున్నాయి భద్రతాబల గాలు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 29మంది నక్సలైట్ల డెడ్‌బాడీలకు కాంకేర్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు.
ఎన్‌కౌంటర్ సమయంలో 70మందికిపైగా నక్సల్స్ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు పోలీసులు. కాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
4 గంటలు హోరాహోరీగా కాల్పులు..
డీఆర్జీ, బీఎస్‌ఎఫ్ జవాన్లు కలసి ఈ ఆపరేషన్ చేసినట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. భద్రతాబలగాలు నక్సల్స్‌ను చుట్టుముట్టగానే ఎదురుకా ల్పులు జరిగాయని.. నాలుగు గంటల పాటు హోరాహోరీగా కాల్పులు జరిగినట్లు చెప్పారు.
ఘటనా స్థలంలో ఏడు ఏకే 47లు, మూడు LMGలు, మూడు ఎస్‌ఎల్‌ఆర్ రైఫిళ్లు, రెండు పిస్టల్స్, రెండు ఇన్సాస్ రైఫిళ్లు, రెండు 303 రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్‌కౌంటర్ సమయలో ఘటనాస్థలంలో పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్లు ఉన్నట్లు తెలు స్తోంది. మృతుల్లో మావోయి స్ట్ నార్త్ బస్తర్ డివిజన్‌కు చెందిన డివిజనల్ కమిటీ సభ్యులు శంకర్, లలిత ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయన తలపై 25లక్షల రివార్డ్..
ఎన్‌కౌంటర్‌లో ఏపీకి చెందిన అగ్రనేత సుగులూరి చిన్నన్న అలియాస్ శంకర్‌రావు ఉన్నారు. ఆయనపై 25 లక్షల రివార్డు ఉంది. ఇద్దరు తెలంగాణ వాసులను కూడా గుర్తించారు.
జయశంకర్-భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ రావుతో పాటు ఆయన భార్య, ఆదిలాబాద్ జిల్లా హత్నూర్‌కు చెందిన దాస ర్వర్ సుమన అలియాస్ రజిత కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం ఇస్తే 5లక్షల నగదు, ఉద్యోగం..
లోక్‌సభ ఎన్నికల వేళ జరిగిన బస్తర్ ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టిస్తోంది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాబలగాలు ఆపరేషన్ బస్తర్‌ను కంటిన్యూ చేస్తున్నాయి. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో హైఅలర్ట్ కొనసాగుతోంది.
మావోయిస్టుల సమాచారం అందించినవారికి 5లక్షల నగదు, ఉద్యోగం ఇస్తామంటూ ప్రకటించారు ఛత్తీస్‌గడ్ పోలీసులు.