TEJA NEWS

జ్యోతి హై స్కూల్ ఐఐటి అకాడమీలో ఘనంగా ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటి అకాడమీ లో ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యాల హరిచరణ్ రావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ” కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఈ రోజు ..దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ… అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా… దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోంది. ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారు అని అన్నారు.శ్రీకృష్ణుడు ఉద్భవించినటువంటి శ్రీకృష్ణాష్టమిని మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కోలాహాలంగా నిర్వహించడం జరుగుతుందని విద్యార్థుల్లో భక్తిభావాలను పెంపొందించడానికై మరియు చారిత్రాత్మకమైన శ్రీకృష్ణుని చరిత్ర తెలియజేయానికై పాఠశాలలో నేడు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం జరిగింది అని అన్నారు.అదే విధంగా ప్రతి సంవత్సరం భగవద్గీత పారాయణ తరగతులను కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు శ్రీకృష్ణుని , గోపికల వేషాధారణలతో విచ్చేసి పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల డైరెక్టర్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు బియ్యాల హరిచరణ్ రావు , శ్రీధర్ రావు మౌనికారావు, అజిత , రజిత ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS