మానవత్వం చాటుకున్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు
ఆర్దిక ఇబ్బందుల్లో విద్యార్థి – ఉన్నత చదువుల కోసం 10,000/- సహాయం
సూర్యాపేట జిల్లా కేంద్రం లోని విద్యానగర్ నందు 45వ వార్డులో నివాసం వుంటున్న పిల్లలమర్రి రేణుక, శ్రీనివాస్ ల కుమారుడు హైదరాబాద్ నాగోల్ లోని శ్రేయాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో బిటెక్ మొదటి సంవత్సరం చదవడానికి ఆర్దికంగా ఇబ్బందులు పడుతున్నాడని తెలుసుకున్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి క్ర్రపాకర్ వార్డులో ప్రజలకు ఎల్లవేళలా అండగా వుంటూ తన వంతు సహాయం చేస్తున్న గండూరి క్ర్రపాకర్ 10,000/- రూ “లను విద్యార్థి తల్లిదండ్రులకు అందజేశారు. వార్డులో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో వుంటూ అవసరమున్న వారికి సహాయం అందించే మంచి మనసున్న వార్డు కౌన్సిలర్ గండూరి పావని క్ర్రపాకర్ దంపతులకు వార్డు ప్రముఖులు ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
మానవత్వం చాటుకున్న జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు
Related Posts
కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు
TEJA NEWS కాలనీ వాసులు పార్క్ నిర్మాణానికి పునుకున్నారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లోని బాలాజీ క్వార్టర్స్ 60 యార్డ్స్ లో సొంతంగా కాలనీ వాసులు పార్క్ నిర్మించుకుంటున్నారు,గతంలో ఎన్నిసార్లు అధికారులకి విన్నవించుకున్న ఎన్నిసార్లు నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఎవరు పట్టించుకోలేదు…
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
TEJA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…