సామాన్యులకు అందుబాటులో పల్స్ హాస్పిటల్
-గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు ఒకే చోట వైద్య సేవలు
-పల్స్ హాస్పిటల్ ప్రారంభించిన డాక్టర్ కందుల సాయి
రాజమహేంద్రవరం, అందుబాటులో పల్స్ హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రముఖ వైద్యులు డాక్టర్ కందుల సాయి, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్ లోని పల్స్ హాస్పిటల్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కందుల సాయి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ దివాన్ చెరువులో ఉన్న విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కు అనుబంధంగా పల్స్ హాస్పిటల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుండె ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన హాస్పిటల్ నగరంలో అందుబాటులో ఉండాలని సదుద్దేశంతో తిలక్ రోడ్డులో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పల్స్ హాస్పిటల్లో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ వంశీకృష్ణరాజు, ప్రముఖ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు లక్ష్మణ్, డాక్టర్ అన్విష్, డాక్టర్ హితేష్ చరణ్ హాస్పిటల్ లో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. అత్యాధునికమైన పరికరాలతో వైద్య సేవలు పేద, మధ్యతరగతి, సామాన్యులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యువ డాక్టర్లు హైదరాబాద్ రాజమండ్రి వంటి నగరాలలో ప్రముఖ హాస్పిటల్ లో వైద్య సేవలు అందించిన అనుభవం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో హాస్పిటల్ ఏర్పాటు చేశారని అన్నారు. వైద్యం కోసం హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాలకు వెళ్లకుండా రాజమండ్రి లోనే ఆధునిక వైద్య సేవలు పొందవచ్చునని అన్నారు. తూర్పు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. తక్కువ ధరలకే ఆధునిక టెక్నాలజీతో వైద్య సేవలు అందిస్తున్నారని వీటిని రాజమండ్రి తో పాటు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.