TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో నిర్వహించిన నాలాలు, కాలువలు మరియు డ్రైన్లలో పూడికతీత కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ శ్రీ కృష్ణయ్య తో, అసిస్టెంట్ మున్సిపల్ కమీషనర్ శ్రీ శ్రీ వాత్సవ్ తో మరియు జిహెచ్ఎంసి అధికారులతో కలిసి ముఖ్యఅతిధిగా పాల్గొన్న హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో నిర్వహించిన నాలాలు, కాలువలు మరియు డ్రైన్లలో పూడికతీత కార్యక్రమంలో పాల్గొని జరుగుతున్న పనులపై అధికారులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదర్ నగర్ డివిజన్ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా అభివృద్ధి చేస్తామని అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వర్షాకాలం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా కూరుకుపోయిన నాలా పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వర్షకాలాన్ని దృష్టిలో పెట్టుకొని నాలాలు, కాలువలు మరియు అంతర్గత డ్రైన్లలో పూడికతీత పనులలో వేగం పెంచాలని, పనులలో ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులకు లేకుండా చూడాలని, నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు అధికారులకు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్రసేనా, ఏఈ రాజీవ్, SRP సత్యనారాయణ, ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ కాళీ, కమ్యూనిటీ ఆర్గనైజర్ ముస్తఫా, RP లు లతా, జ్యోతి, ఎలేంద్ర, రేణుక, సుబ్బా లక్ష్మి, SFA గోపాల్ కాలనీ వాసులు KSR మూర్తి, రామచంద్ర రెడ్డి, ప్రసాద్, సూర్య నారాయణ రాజు, రాఘవరావు నాయకులు కుమార స్వామి, నిరంజన్ గౌడ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS