TEJA NEWS

శాస్త్రోతంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాటా మహోత్సవం
-గణనాథుని ఆశీస్సులతో రాటా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా…
రాజమహేంద్రవరం, :
రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నా మని వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం పుష్కరాల రేవు వద్ద గణపతి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవ రాట ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జక్కంపూడి రాజాతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గత 13 సంవత్సరాల కాలంగా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నందు రాజమండ్రి గణేష్ ఉత్సవ కమీటీ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి కావడంతో ఆ రోజు నుండి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయని నవరాత్రి ఉత్సవాలకు ముందుగా ఏర్పాట్లు,ఇతర పనులు చేసేందుకు ఉత్సవ రాట కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టమన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్త కుండా స్వామివారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించే విధంగా, భక్తులందరినీ ఆకర్షించే విధంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. గణనాథుని ఆశీస్సులు కరుణాకటాక్షాలు రాజమహేంద్ర వరం ప్రాంత పరిసరాల ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో బైర్రాజు ప్రసాద్ రాజు, శ్రీ కన్య రాజు, కొమ్ముల సాయి, కరుణామయుడు శ్రీను,నీడిగట్ల బాబ్జి, కోడి కోట, కరుణామయుడు బోసు, అడపా అనిల్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS