TEJA NEWS

శ్రీ వజ్రగణపతి ఆలయంలో రాట మహోత్సవం
వాకచర్ల కృష్ణ దంపతులచే పూజా కార్యక్రమం

రాజమహేంద్రవరం, :
స్థానిక 23 వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయం సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగనున్న 23 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాట మహోత్సవం వైభవంగా నిర్వహించారు.మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సూర్యకుమారి దంపతులు శాస్త్రోక్తంగా పూజ నిర్వహించారు.పురోహితులు బోడెం రవికుమార్ శర్మ పూజా కార్యక్రమం జరిగింది.వచ్చే నెల 7 వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు.కార్యక్రమంలో పొత్తూరి యతిరాజ్ సంపత్ కుమార్, పేరూరి మహేంద్ర, పేరకం వెంకట సీతారామ్,పొత్తుల వెంకట సత్యనారాయణ, భీమేశ్వరరావు, మిరియాల భాస్కర్,మద్దుల శ్రీనివాస్,చించినాడ తాతాజీ,పెరుమాళ్ళ సత్యనారాయణ,కందం సందీప్ ,రామకృష్ణ,మారడుగు సుబ్బయ్య,నాగుమిల్లి గుప్తా,కంకటాల రాము, పెరుమాళ్ళ గోపాల్,అనిల్,జ్యోతి రామ్,పొత్తూరి రేణుక,పేరకం అనంతలక్ష్మి,వాణి,గంగ,రేఖ, వెంకటలక్ష్మి,తులసి, విజయలక్ష్మి,రాధ,రాజక్క,
నంబూరి రాధిక తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS