మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం రెవెన్యూ లోని పెద మొల్లోడు గెడ్డ పరివాహక ప్రాంతం లోని ఆక్రమణను రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తొలగించారు.51 సర్వే నెంబర్ లోని గెడ్డ స్థలం సుమారు 30 సెంట్లు వరకూ ఆక్రమించి ఓ భూ కబ్జాదారుడు గెడ్డను కబ్జా చేసాడు. ఏకంగా గెడ్డను కప్పేసి పక్కనున్న తన సొంత భూమిలో కలుపుకున్నాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. రెండ్రోజుల క్రితం సర్వేయర్తో సర్వేయించి గెడ్డ ఆక్రమణకు గురయినట్లు గుర్తించారు. ఈ మేరకు జెసిబిని తీసుకెళ్లి ఆక్రమణను తొలగించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, గెడ్డలను ఆక్రమిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉంటే అక్రమదారుని పై అధికారులు ల్యాండ్ గ్రాభింగ్ కేసు పెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
TEJA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
TEJA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…