TEJA NEWS

నరకానికి దారి రావులపల్లి రహదారి. తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్న గ్రామ ప్రజలు… పట్టించుకోని నాయకులు అధికారులు……..
శంకర్ పల్లి;

ప్రభుత్వాలు మారుతున్న ప్రజల సమస్యలు మాత్రం తినడం లేదు. గత పది సంవత్సరాల నుండి శంకర్ పల్లి నుండి రావులపల్లి కి వెళ్లే రహదారి పూర్తిగా గుంతల మయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగు రోజుల్లో కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ పూర్తిగా గుంతల మయంగా తయారయింది. గ్రామంలో ఉన్న నాయకులు మండల స్థాయి నాయకుల మధ్య ఉన్న భేదా అభిప్రాయాల వల్ల, చిన్న చిన్న గొడవలు మనస్పర్దాల వల్ల వారి స్వలాభం కోసం గ్రామ ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్నారు. శంకర్ పల్లి నుండి రావులపల్లి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఐదుగురు కిలోమీటర్ల మేర రోడ్డు గుంతల మయంతో అధ్వానంగా తయారైంది. గ్రామంలో ఉన్న ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. ఉదయం నాలుగు గంటలకే పండించిన కూరగాయలు నగరానికి మరియు శంకర్ పల్లి కి మార్కెట్ కు తరలిస్తారు. రోడ్డు గుంతల కావడంతో రైతులు ప్రయాణిస్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. విద్యార్థులు కాలేజీలు పాఠశాలలకు వెళ్లాలంటే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతోందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు ఓట్ల కోసం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఓట్లు వేయించుకున్న తర్వాత గ్రామ అభివృద్ధిని మడుగున పడేస్తున్నారు. నియోజకవర్గ నాయకులు కూడా ఎన్నికల సమయంలోనే గ్రామంలో పర్యటించి ప్రజలతో ఓట్లు వేయించుకొని తర్వాత గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదని ప్రజలు మండిపడుతున్నరు. గర్భిణీ స్త్రీలు పట్టణానికి ఆసుపత్రికి వెళ్లడానికి నరకయాతన అనుభవిస్తున్నారు. ఐదు కిలోమీటర్ల మేర మోకాళ్ళ వరకు గుంతలు కావడంతో యువకులు వృద్ధులు ద్విచక్ర వాహనాలపై ప్రమాదాలకు గురి కావడంతో ప్రాణాల చేతిలో పెట్టుకొని ప్రేమిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ నాయకులు రావులపల్లి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసి రోడ్డున వేయాలి రావులపల్లి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు……………………………. తెలుగు మల్లేష్ రావులపల్లి గ్రామం.

…….

శంకర్ పల్లి- రావులపల్లి రోడ్డును త్వరగా మరమ్మతులు చేపట్టండి…..

తెలుగు మల్లేష్….. రావులపల్లి.
……………..
……. రావులపల్లికి గ్రామానికి వెళ్లే రహదారి పూర్తి గుంతలు మాయం కావడంతో తరచు ప్రమాదాలకు గురవుతున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు హామీలు ఇచ్చి గెలిచాక ఎవరు పట్టించుకోవడంలేదు. రోడ్డు గుంతలుగా ఉండడంతో విద్యార్థులు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే చేవెళ్ల కాలే యాదయ్య చొరవ తీసుకుని నిధులు మంజూరు చేసి గ్రామానికి వెళ్లే రహదారి బాగు చేయించాలని విన్నపించుకుంటున్నాము..


TEJA NEWS