TEJA NEWS

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి అధికారులను ఆదేశించారు.
శనివారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాల్ నందు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసులు, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు తో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరు సమాజంలో సమాన హక్కులతో జీవించాలనే స్ఫూర్తి కలిగించిందని పేర్కొన్నారు. ప్రతి అధికారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీలు జరగకుండా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని, అన్నారు. భూ సమస్యలపై పై ప్రత్యేక దృష్టి సారించి జవాబుదారితనంతో పని చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వచ్చిన వెంటనే ఎఫ్.ఐ.ఆర్ పక్కాగా నమోదు చేయాలని ,తప్పు కేసులు ఉంటే, వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని, మరియు కేసులు కచ్చితమైన ఆధారాలతో ఉండాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెండింగ్‌లో ఉన్న ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను కోర్టు పరిధికి తీసుకెళ్లి, తగు విధంగా రెప్రజెంట్ చేసి దానికి అనుగుణంగా విచారణ జరిపేలా చూడాలని, తద్వారా వేగవంతమైన న్యాయం జరుగుతుందని అన్నారు.పరిహార విషయంలో బాధితులకు పూర్తి సహకారం అందించాలని, పరిహారం అందించిన తర్వాత కూడా బాధితుడు దానిని సద్వినియోగం చేసుకుంటున్నాడా లేదా అనే విషయాన్ని అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. డి.వి.ఎం.సి కమిటీ సభ్యులు హాజరుకాని వారిపై అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. సివిల్ రైట్స్ డే రోజున డి.వి.ఎం.సి కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలో ప్రజలను సమావేశ పరిచి, అధికారులతో సమన్వయము అయ్యి ఎస్సి.ఎస్టి అట్రాసిటీల పై వివరణలను ప్రజలకు తెలియజేయాలన్నారు.


జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం పౌరులకు సమాన హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులలో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో 118 పెండింగ్ కేసులు ఉన్నాయని, వీటిని తక్షణమే పరిష్కరించడానికి సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ అధికారులు ప్రతి కేసును చట్టపరంగా సమర్థవంతంగా ప్రతినిధ్యం వహించి, కోర్టులో జడ్జి ముందుకు కేసులను తీసుకెళ్లలాని అన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి నెల టార్గెట్‌ లు నిర్ధేశించుకోవాలని, వాటిని నిర్ణీత గడువులోపే పూర్తి చేయాలని అన్నారు.పోలీస్ డిపార్ట్మెంట్‌కు ఎఫ్.ఐ.ఆర్ నమోదు విషయంలో మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, తప్పుడు కేసులను ఎప్పటికీ ప్రోత్సహించకూడదని, నిజాయితీగా న్యాయం చేయాలని, భూ సమస్యలకు సంబంధించి త్వరితగతిన పరిష్కారం చేస్తామన్నారు.బడ్జెట్ కేటాయింపులు మరియు కాంపెన్సేషన్ విషయంలో ఎటువంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల కోసం ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పని చేస్తుందని కలెక్టర్ అన్నారు.


జిల్లా ఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కేసుల విషయంలో జీరో టోలరెన్స్ విధానాన్ని అనుసరిస్తామని, వచ్చిన ప్రతి పిటిషన్‌ను రిజిస్టర్ చేయడం జరుగుతుందని, ఆన్లైన్‌లో కూడా పిటిషన్ తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే, పోలీస్ యంత్రాంగం ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమర్థవంతమైన న్యాయం అందిస్తామన్నారు.
అలంపూర్ శాసనసభ్యులు విజయుడు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను వేగంగా పరిష్కరిస్తామని, ప్రజలకు ప్రభుత్వం తరపున అందరికీ తోడుగా ఉండి న్యాయం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రామ్ చందర్, డిఎస్పి సత్యనారాయణ, ఇన్చార్జి బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ సరోజమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ నుజితా, ఏపీపీ స్పెషల్ పీసీఆర్ కోర్ట్ విజురేఖ, ఈడీఎస్సీ రమేష్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, ఎ.డి.ఎ సక్రియ నాయక్ , సి సెక్షన్ సుపెర్దిదేంట్ నరేష్, డివిఎంసి మెంబర్స్, తదితరులు పాల్గొన్నారు…


TEJA NEWS