TEJA NEWS

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్

శంకర్‌పల్లి: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, డాక్టర్ రేవతి రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెంగ్యూ, చికెన్ గున్యా పట్ల అప్రమత్తంగా ఉండి జ్వరం ఉన్నట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావాలన్నారు. వర్షాకాలంలో ఇంటి పరిసర ప్రాంతాలలో మురికి గుంటలు ఉన్నట్లయితే దోమలు పెరిగి డెంగ్యూ చికెన్ గున్యా బారిన పడుతారని అన్నారు. ప్రజలు ఇంటి పరిసర ప్రాంతాల్లో మురికి గుంటలు లేకుండా చూసుకోవాలన్నారు. కాచి చల్లార్చి వొడపోసిన నీటిని మాత్రమే త్రాగాలని, వేడి వేడి ఆహార పదార్థాలు భుజించాలని, దీనివలన కొంతవరకు వ్యాధులను అరికట్టవచ్చు అన్నారు. సీఐ హబీబుల్లాఖాన్ మాట్లాడుతూ రాబోయే గణేష్ ఉత్సవాలలో ఎటువంటి అనుచిత సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సురేందర్, ఎస్సై సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.


TEJA NEWS