TEJA NEWS

రేవతి హై స్కూల్ లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

రేవతి హై స్కూల్ లో ముందస్తుగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులు, శ్రీకృష్ణుడి,గోపికల వేషధారణలు ధరించి ఉట్టి కొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు. చిన్నపిల్లలు చేసిన అల్లరి చేష్టలు మరియు చిన్నారుల నృత్యాలు అందర్నీ ఆకర్షించాయి. రేవతి హై స్కూల్ కరస్పాండెంట్ వై.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతి పండుగకు సంబంధించి వాటి ప్రాముఖ్యతను చిన్నారులకు తెలిసేలా చేయడం చాలా సంతోషంగా ఉందని కోరారు. మరియు విద్యతో పాటు మన సాంస్కృతిక, సాంప్రదాయాల పండుగ ల గురించి విద్యార్థులకు తెలియజేయడం చాలా మంచిదని ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో రేవతి హై స్కూల్ ప్రిన్సిపాల్, రాజు సార్, అకాడమిక్ డైరెక్టర్ పావని మేడం,పి.ఇ.టి.ఇ.గణేష్, జోష్నా, అర్చన, సరిత రెడ్డి, శ్రీవాణి, రాజేశ్వరి, ప్రియాంక, శ్రీలక్ష్మి, లేఖన, మానస, లావణ్య, సంతోష ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS