స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్.

స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్.

TEJA NEWS

స్మృతి వనంలో మార్నింగ్ వాకర్స్ తో న్యూ ఇయర్ అడ్వాన్స్ సెలబ్రేషన్స్ లో ఎస్పి రితిరాజ్.

గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో స్మృతి వనంలో ఆదివారం రోజు సాయంత్రం ఐదు గంటలకు మార్నింగ్ ఈవినింగ్ వాకర్స్ తో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అడ్వాన్స్ గా కేక్ కట్ చేసి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ఎస్పీ రితిరాజ్. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..జిల్లాలోని ప్రజలందరూ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరుపుకొని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఆమె అన్నారు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థులు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్న సందర్భంలో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థి పరీక్షల కొరకు ప్రిపరేషన్ మంచిగా చదువుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి స్మృతి వనంలో మహిళలకు ప్రత్యేకంగా మంచినీటి వసతి, లైటింగ్, వాష్ రూమ్ లు సెక్యూరిటీ పరంగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మార్నింగ్, ఈవినింగ్ వాకర్స్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఎస్పీ. ఇట్టి కార్యక్రమంలో కె అరుణ, కే మాధవి, డిఆర్ మంజుల, కే సంధ్యారెడ్డి, పి జ్యోతి, కౌన్సిలర్ మహేశ్వరి తదితర మహిళలు ఉన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS