నూతన భవనాలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు

TEJA NEWS

నూతన భవనాలను ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు

ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కోదురుపాక గ్రామంలో నూతనంగా నిర్మించిన RURBAN, ZPP, SDF 12.50 లక్షల రూపాయల నిధులతో అంగన్ వాడి మరియు MGNREGS, RURBAN & GP 25 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ కోదురుపాక గ్రామ అభివృద్దికి నా వంతు సహాయ సహకారాలు అన్ని రకాలుగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. శ్రీ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారని, పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ “ప్రజా పాలన” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణకు అధికారులందరూ పూర్తి బాధ్యత వహించి ప్రజలందరికీ సహకరించాలని సూచనలు చేశారు. రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్దాం అని తెలపడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ జడ్పీటీసీ మినుపాల స్వరూప ప్రకాష్ రావు గారు,ఎంపీపీ,గ్రామ సర్పంచ్ దేవరనేని సాగర్ రావు గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్ గారు దానాయక్ దామోదర్ రావు గారు చిలుక సతీష్ గారు మరియు ఎంపీటీసీలు మందల రమేశ్,, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పన్నాల రాములు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు భుష్ణవేన రాజ గౌడ, శ్రీనివాస్ గౌడ్,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page