జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోని స్పెషల్ ఆఫీసర్, పిజిసిఆర్టి, సిఆర్టిటి మరియు పిఈటి లు అలాగే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలోని స్పెషల్ ఆఫీసర్ సిఆర్టీల ఖాళీలలో తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో పనిచేయుటకు గత సంవత్సరం ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించడం జరిగింది. తద్వారా మెరిట్ లిస్ట్ ఆధారంగా ఖాళీలను భర్తీ చేయడం జరిగింది.
ప్రస్తుతం 2024 – 25 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఖాళీలను గత సంవత్సరం నిర్వహించిన పరీక్ష మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులతో ప్రస్తుతం ఉన్న ఖాళీలను భర్తీ చేయమని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ఖాళీల వివరాలు :
కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో స్పెషల్ ఆఫీసర్ – 03, పీజీ సీఆర్టీ ఇంగ్లీష్ – 05, పీజీ సీఆర్టీ ఫిజిక్స్ – 01, పీజీ సీఆర్టీ కెమిస్ట్రీ – 02, పీజీ సీఆర్టీ బాటనీ – 01, పీజీ సీఆర్టీ నర్సింగ్ I & II – 04, పీజీ సీఆర్టీ తెలుగు – 03, సీఆర్టీ తెలుగు – 01, సీఆర్టీ హిందీ – 03, సీఆర్టీ ఇంగ్షీషు – 02 , సీఆర్టీ మాథ్స్ – 06 , సీఆర్టీ ఫిజికల్ సైన్స్ – 04, సీఆర్టీ బయోలాజికల్ సైన్స్ – 04, సీఆర్టీ సోషల్ – 01, మరియు పిఈటీ – 05, అలాగే అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో – స్పెషల్ ఆఫీసర్ – 01 , సీఆర్టీ మాథ్స్ – 01 మొదలగు ఖాళీలు ఉన్నాయని జిల్లా విద్యాశాఖాధి గారు ధృవీకరించడం జరిగింది.
జిల్లా విధ్యాశాఖాధి కారి
వికారాబాద్ జిల్లా