TEJA NEWS

స్ఫూర్తి అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వారి ఆధ్వర్యంలో

నజీర్ ఖాన్ కు సేవారత్న అవార్డ్ ప్రధానం

సూర్యాపేట పట్టణ కేంద్రానికి చెందిన జర్నలిస్ట్ , సామాజిక వేత్త నజీర్ ఖాన్ కు ఈనెల 29న హైదరాబాద్ కింగ్ కోటి లోని తెలంగాణ సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో ఏషియన్ వేదిక్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, పీస్ ఆఫ్ ఇండియా ఎన్జీవో, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో, ఆసియా వేదిక్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ సంయుక్త అధ్వర్యంలో ఉత్తమ సేవారత్న అవార్డును అందిస్తున్నట్లు ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసర్చ్ స్ఫూర్తి అకాడమీ -స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్, స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్జీవో ఫౌండర్ అండ్ చైర్మన్, లయన్ డాక్టర్ ఆకుల రమేష్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా సామాజిక సేవ కార్యక్రమాలల్లో చురుకుగా పాల్గొంటూ , జర్నలిజంలో తనదైన శైలిలో వార్త కథనాలు రాస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ , అనేక సందర్భాల్లో రక్త దానం చేసి ఎంతోమందికి కొత్త జీవితం అందించారు .పలు సంస్థలలో వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తూ తన వంతుగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ , మైనార్టీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే విషయంలో ముందు వరుసలో ఉంటూ పలు రంగాలలో రాణిస్తున్నందుకుగాను ఉత్తమ సేవారత్న ఆవార్డును నజీర్ ఖాన్ కి ప్రదానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఉత్తమ సేవారత్న అవార్డ్ గ్రహీత నజీర్ ఖాన్ మాట్లాడుతూ ఈ అవార్డ్ రావడంతో నాకు ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని అన్నారు . అవార్డ్ ప్రధానం చేస్తున్న స్ఫూర్తి అకాడమీ ఇంటర్ నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రీకార్డ్ , స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఎన్ జి ఓ సంస్థకి , చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ కి ధన్యవాదాలు తెలిపారు .
నజీర్ ఖాన్ కి ఉత్తమ సేవారత్న అవార్డ్ రావడం పట్ల ఎన్ వి ఆర్ నేటి సామాన్యుడు చైర్మన్ నిమ్మరెడ్డి వెంకట్ రెడ్డి , న్యూస్ కరస్పాండెంట్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గుర్రం మల్లేష్ , ఎన్ వి ఆర్ నేటి సామాన్యుడు న్యూస్ టీం సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు .

Print Friendly, PDF & Email

TEJA NEWS