TEJA NEWS

అంగరంగవైభవంగా
నాగారం లో శ్రీకృష్ణ జన్మాష్టమి

:నేటి తరo హిందూధర్మ పరిరక్షణ కు అనాదిగా నిర్వహిస్తున్న పండుగలు ఆదర్శంగా జరుపుకోవడానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మేడ్చల్ జిల్లా కోశాధికారి సీనియర్ జర్నలిస్ట్ బర్ల బిక్షపతి ముదిరాజ్,ఛైర్మన్ మాధిరెడ్డి ప్రతాప్ రెడ్డి కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నాగారం ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు.మహిళలు కోలాటం చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపిక వేషధారణ ఆకట్టుకున్నాయి. శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం నుంచి నాగారం, సత్యనారాయణ కాలనీ,రాంపల్లి చౌరస్తా సుమారు 5కిలోమీటర్ల మేర శ్రీకృష్ణ శోభా (ఊరేగింపు) యాత్రనిర్వహించడం జరిగింది మహిళలు కోలాటం ఆడుతూ డ్యాన్సులు చేసుకుంటూ అంగరంగవైభవంగా జరుపుకున్నారు.
రాజనీతి, ధర్మ పరిరక్షణ, దౌత్యం, స్నేహ ధర్మం, స్వజన సంరక్షణ… ఇలాంటి సత్కార్యాలన్నిటీనీ నేర్పుతో నిర్వర్తించి లోకానికి శ్రీకృష్ణుడు మార్గదర్శకుడయ్యాడు అని ప్రతాప్ రెడ్డి,బిక్షపతి ముదిరాజ్ అన్నారు. ఈరోజు దేవకి సుతుని జన్మదినం సందర్భంగా ప్రజలందరూ శ్రీ కృష్ణాష్టమి జరుపుకొనుచున్నారు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భువి మీద అవతరించిన మహా అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడు.
ఈ కార్యక్రమంలో బిక్షపతి ముదిరాజ్,ప్రతాప్ రెడ్డి,తడిసి సూర్యప్రకాష్ రెడ్డి,నర్సింగ్ నాయిబ్రాహ్మణ, హన్మంతరావు, కాశీ, శాస్త్రి,కమలాకర్,జంగారెడ్డి,తడిసిజయశ్రీ,బర్ల రేవతి,మాధిరెడ్డి వరలక్ష్మీ,సమత,వీణ, మమత,జయశ్రీ పలువురు భక్తులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS