TEJA NEWS

వెల్గటూర్ లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు*

ఆకట్టుకున్న చిన్నారుల వేషాదారణలు..
లయన్స్ క్లబ్ వారిచే పిల్లలకు ప్రత్యెక బహుమతులు అందజేశారు

జగిత్యాల జిల్లా వెల్గటూర్ లో వీరా & నాని యూత్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలు అంబరాన్న0టాయి.
వెల్గటూర్ లో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఆనందోత్సాహాలమధ్య జరుపుకున్నారు.
ప్రతి ఒక్కరు సోదర , భక్తి భావంతో ఉండాలని, పలు పూజా కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా చేపట్టి భగవంతుని ఆశీస్సులు పొందే విధంగా చేపట్టారు.

శ్రీకృష్ణుడు ఉద్భవించినటువంటి శ్రీకృష్ణాష్టమిని మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కోలాహాలంగా నిర్వహించడం జరుగుతుందని చాటి చెప్పే విధంగా ధర్మపురి నియోజక వర్గంలోని కొన్ని చోట్ల ఉట్టి కొట్టారు. ఉత్సాహానికి ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తున్న శ్రీకృష్ణాష్టమి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు.
పిల్లల్లో భక్తిభావాలను పెంపొందించడానికై చారిత్రాత్మకమైన శ్రీకృష్ణుని చరిత్ర తెలియజేయానికై కృష్ణాష్టమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా చిన్నారులను శ్రీకృష్ణుడు, గోపికల వేషాధారణలతో అందంగా అలంకరించారు.
పిల్లనగ్రోవి, కిరీటం, ధోవతులు కట్టి కృష్ణుడిని తలపించేలా వేషధారణలు అందరిని ఆకట్టుకున్నాయి.
అలాగే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనృసింహ్మ స్వామి, కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి,ఆలయంలో భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా భక్తుల సందడితో ఆలయాలు కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు & యూత్ సభ్యులు తదితరులు పాలుగొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS