TEJA NEWS

20 సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపిణి చేస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం

పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత: రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా

మట్టి గణపతులను వాడి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిది అని గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి మట్టి గణపతులను స్వయంగా తయారుచేసి భక్తులకు ఉచితంగా వినాయక చవితి రోజు అందిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా పర్యావరణాన్ని గురించి వివరించి, ప్రతి ఒక్కరికి మట్టి గణపతులను అందజేస్తున్నామన్నారు.
ప్లాస్టరప్ ప్యారిస్ తో తయారైన విగ్రహాల వల్ల రసాయనాలు వెలుబడి పర్యావరణాన్ని కీడు చేస్తాయని. చెరువులో వేయడం వల్ల చేపలు, ఇతర జీవరాసులకు ముప్పు కలుగుతుందన్నారు. అందుకే మట్టి గణపతులే శ్రేయస్కరం అన్నారు. ఈ కార్యక్రమంలో రామకోటి ప్రతినిధులు పాల్గొన్నారు


TEJA NEWS