వైభవంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం
అమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాన్ని తిలకించిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్
రాజమహేంద్రవరం, :
స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారి
మఠం వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 73వ జాతర మహోత్సవం
అంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవానికి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర మఠం వీధిలో వెలిసిన వేంచేసిన శ్రీ శ్యామలాంబ అమ్మవారిని శ్రీనివాస్ దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవ కమిటీ నాయకులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు ఆలయ మర్యాదలతో సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికి వేద పండితుల ఆచరివచనం ఇప్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ స్థానిక ప్రజలకు అభివాదం చెప్పారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి కృపకు పాత్రులై ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. 73 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా జరుగుతున్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతరలో డప్పు వాయిద్యాలు, గరగనత్యాలు, శక్తి వేషాలు, అఘోరాల ప్రదర్శన, కాళికాదేవి, శివుడి వేషధారణ తదితర వంటి జానపద నృత్య రూపకాలు విశేషంగా అలరించాయి. ఉత్సవ కమిటీ ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్వాగతం తెలిపిన వారిలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ పిల్లా వెంకన్న, ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి వెల్లంకి జయరాం, వైస్ ప్రెసిడెంట్లు కుడిపూడి నాగేశ్వరరావు (నాగు), కంచుపల్లి శ్రీను, రాజాన భద్రరావు, హర్ష, రాజాన శేఖర్, వీరవల్ల శివ, యర్ర క్రాంతి, కోశాధికారి సుబ్రహ్మణ్యం, నాయకులు గొంతుకూరి అప్పారావు, కమిటీ యువకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
TEJA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
TEJA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…