TEJA NEWS

ఉస్మా’నయా హాస్పిటల్’ కు అడుగులు

ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం కోసం చకచకా అడుగులు పడుతున్నాయి. గోషామహల్ గ్రౌండ్స్ లో కొత్త భవనం నిర్మించాలని సీఎం ఆదేశించడంతో.. అక్కడి పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పేట్ల బురుజులోని పోలీసు అకాడమీకి రిలొకేట్ చేయడానికి సాధ్యాసాధ్యలను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ ఫీల్డ్ లెవెల్ పరిశీలన జరిపారు. అడిషనల్ డీసీపీ భాస్కర్, ఆర్డీవో జ్యోతితో కలిసి పోలీసు అకాడమీని పరిశీలించారు. . అకాడమీలో మొత్తం 12 ఎకరాల స్థలంఉన్నట్లు రెవెన్యూ అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఇందులో 6 ఎకరాల్లో గ్రౌండ్ ఉండగా, మిగతా ఆరు ఎకరాల్లో పోలీస్ ట్రైనింగ్ కు సంబంధించిన ఆఫీసులు, శిథిలావస్థలో పలు భవనాలు ఉన్నట్లు చెప్పారు. అకాడమీకి ఎదురుగా ఉన్న పోలీస్ ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషన్ లో సుమారు 5.27 ఎకరాలు, దాని పక్కనే ఉన్న సిటీ ట్రాన్స్పోర్టు ఆర్గనైజేషన్ లో మరో 6 ఎకరాల స్థలం ఉండొచ్చని చెప్పారు. ఈ రెండు స్థలాలను కూడా పరిశీలించి, త్వరలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు కలెక్టర్ అనుదీప్ వివరించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS