TEJA NEWS

కవితకు బెయిల్.. ఈడీ, సీబీఐలకు సుప్రీంకోర్టు అక్షింతలు!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. ఈ సందర్భంగా ఈడీ, సీబీఐలను మందలించింది. దర్యాప్తు సంస్థల విచారణ తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్రూవర్లను సాక్షులుగా ఎంపిక చేసుకోవడాన్ని జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం తప్పుబట్టింది. అప్రూవర్‌లుగా మారిన నిందితుల సాక్ష్యాలను ఎలా పరిగణిస్తారంటూ ప్రశ్నించింది. విచారణ పారదర్శకంగా సాగాలని సూచించింది.

కాగా దాదాపు 5 నెలలుగా జైలు జీవితం గడిపిన కవిత ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆమె జైలు నుంచి విడుదలవుతారు. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరఫు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు. ఈ రాత్రికి ఆమె ఢిల్లీలోనే బస చేసి, రేపు ఉదయం కేటీఆర్, హరీశ్ రావుతో కలిసి కవిత ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. అనంతరం ఆమె విమానంలో వారితో కలిసి హైదరాబాద్ కు చేరుకుంటారు. అరెస్ట్ తరువాత 5 నెలల జైల్లోనే ఉన్న కవిత ఏ ఆంశాలపై మాట్లాడనున్నారు అన్నది ఆసక్తి నెలకొంది.

బెయిల్‌ మంజూరుకు సుప్రీంకోర్టు మూడు ప్రధానమైన కారణాలు చెప్పింది. సీబీఐ తుది ఛార్జిషీట్‌ దాఖలు చేసిందని.. ఈడీ కూడా దర్యాప్తు పూర్తిచేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS