TEJA NEWS

రెవెన్యూ రికవరీ యాక్ట్ ఫై తాసిల్దార్లు పూర్తి అవగాహన కలిగి ఉండాలి.,…… జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

వనపర్తి :
వనపర్తి జిల్లా
తాసిల్దారులు రెవెన్యూ రికవరీ యాక్ట్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఆదేశించారు.
ఉదయం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో తహసిల్దారులకు రెవెన్యూ రికవరీ యాక్ట్ స్పెషల్ సమ్మరీ రివిజన్ పై దిశా నిర్దేశం చేశారు.
ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఎవరైనా సకాలంలో చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా సదరు వ్యక్తి నుండి రికవరీ చేసే బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉంటుందన్నారు.
ఈ యాక్టివ్ ప్రకారం మొదటగా మొండిబకాయలు ఉన్న వ్యక్తికి ఫారం-I ద్వారా నోటీసు జారించేయడం జరుగుతుందని 15 రోజుల్లోగా ప్రభుత్వానికి కట్టాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ఈ నోటీసు ద్వారా జారీ చేయడం జరుగుతుందన్నారు. అయినప్పటికీ చెల్లించని పక్షంలో ఫారం – 2 జారీ చేసి నోటీసు అనంతరం సదరు వ్యక్తి చరాస్తిని జప్తు చేసుకోవడం జరుగుతుందన్నారు. అయినప్పటికీ చెల్లించి తన చరాస్థిని తీసుకువెళ్ళిని పక్షంలో ఫారం 3 జారీ చేసి చారాస్తిని వేలం వేసి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తాన్ని రాబట్టుకోవడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ రికవరీ యాక్టు అమలు చేసేటప్పుడు తగు రీతిలో పంచనామా చేయడం, నిబంధనలు పాటించాల్సి ఉంటుందన్నారు.
అనంతరం స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి ఎలక్టర్ల మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల వివరాలు సేకరించాలని అదేవిధంగా రికార్డులు సరిగ్గా నిర్వహించాల్సి ఉంటుందని తెలియజేశారు. 1-1-2008 కంటే ముందు జన్మించిన వారందరినీ కొత్త ఎలక్టర్ల జాబితాలో చేర్చేందుకు ఫారం 6 ఇచ్చేవిధంగా బిఎల్ఓ లకు సూచనలు ఇవ్వాలన్నారు.
స్పెషల్ సెమ్మరి డివిజన్లో కొత్త పోలింగ్ స్టేషన్లో ప్రతిపాదనలు రేషనల్లైజేషన్ ప్రతిపాదనలు చేయాలని తెలియజేశారు. మండల స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమావేశము ఏర్పాటు చేసి స్పెషల్ సమ్మరీ రివిజన్ పై అవగాహన కల్పించాలని తెలియజేశారు.
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్, ఆర్డీవో పద్మావతి, తహఃసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS