మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్
శంకర్‌పల్లి: మొక్కలను నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్ అన్నారు. స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి బుల్కాపూర్ 4, 5 వార్డులలో వనమహోత్సవం కార్యక్రమం జరిగింది. అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ తో కలిసి మొక్కలను నాటి నీరు పోశారు.
అనంతరం పట్టణ పరిధిలోని డంపింగ్ యార్డును అడిషనల్ కలెక్టర్ సందర్శించారు. అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షణ చేపట్టితే పచ్చదనంతో పాటు ఆక్సిజన్ లభ్యమవుతుందన్నారు. వర్షాకాలంలో ప్రభావితమయ్యే వైరల్ ఫీవర్ మరియు ఇతbర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి, కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.