TEJA NEWS

వ్యాసరచనలో శ్రీ ఆదర్శ విద్యార్థుల ప్రతిభ

టాటా సంస్థ నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. టాటా బిల్డింగ్ ఇండియా సంస్థ విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు ‘స్మార్ట్ ఇండియా నిర్మాణంలో యువత పాత్ర ‘ అనే అంశంపై దేశవ్యాప్తంగా పలు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఇటీవల నిర్వహించారు. ఈ పోటీల్లో సీనియర్స్ విభాగంలో నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు గుంటి గణేష్ (10వ తరగతి) దూబ నందిని, బైరు సాయి పూజలు ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. జూనియర్స్ విభాగంలో 8వ తరగతి చదువుతున్న మంద నిరోష, ఏడవ తరగతి చదువుతున్న కొదమ సింహం శ్రీహర్ష, నున్నా రుషితలు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. పాఠశాలలో శనివారం జరిగిన కార్యక్రమంలో టాటా సంస్థ ప్రతినిధులు తుమ్మారపు భార్గవ్, సోమిరెడ్డిలు విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్, ప్రిన్సిపల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు గంగుల ప్రశాంతి, బోళ్ళ రేణుక, గోపీచంద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS