TEJA NEWS

తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్ అసోసియేషన్ స్టేట్ మీట్ విజేతలను సన్మానించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మెదక్ లో నిర్వహించిన స్టేట్ మీట్ లో విజేతలుగా నిలిచిన అథ్లెటిక్స్ జయలక్ష్మి 800మీటర్ల గోల్డ్ మెడల్, గణేష్ జావేలీన్ త్రో సిల్వర్ మెడల్, మహేష్ ట్రిపుల్ చైజ్(3km) బ్రాంజ్ మెడల్, గెలుపొందారు వీరిని గద్వాల ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు భవిష్యత్తులో ఇటువంటి విజయాలు మరెన్నో గెలుపొందాలని జాతీయ స్థాయిలో మంచి ప్రతిభ కనబరచాలని మీ తల్లిదండ్రులకు, మన గద్వాలకు మంచి పేరు తీసుకురావాలని అభిందించారు.

ఈ కార్యక్రమంలో నాయకులు నర్సింహులు, గోవిందు, PET కృష్ణయ్య అసోసియేషన్ అధ్యక్షులు, వెంకట్రాములు, సతీష్, నగేష్, రఘు, అశోక్, బీసన్న, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS