TEJA NEWS

పట్టా భూమిని అక్రమించి గుడిసెలు వేశారు
తొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారు
అన్ని హక్కులు ఉన్న నా భూమికి రక్షణ కల్పించాలి
స్థానికేతరుల దాడులపై చర్యలు తీసుకోవాలి
మీడియా సమావేశంలో భూ యజమాని వేజళ్ల సురేష్ కుమార్

తన పట్టా భూమిలో గుడిసెలు వేసి తొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారని భూ యజమాని వేజళ్ల సురేష్కుమార్ తెలిపారు. కొంత మంది పేదల ముసుగులో స్థానికేతర అరాచక శక్తులను పోగేసి పట్టా భూములు అక్రమిస్తూ ఇబ్బందులు పెడుతున్నారని ఆయన తెలిపారు.

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు బుధవారం చేసిన విలేకరుల సమావేశంలో వెజళ్ల సురేష్ కుమార్ మాట్లాడుతూ.. తాను పోతుల వెంకటేశ్వర్లు, సీతయ్య అనే వ్యక్తుల నుంచి సర్వే నెం. 148లో మూడు ఎకరాల ఎనిమిది కుంటలు, సర్వే నెం.149లో ఐదు ఎకరాలను కొనుగోలు చేశానని చట్టబద్దంగా లే అవుట్ అనుమతులు తీసుకున్నానని ఇందుకు గాను రూ. 30లక్షలు ప్రభుత్వానికి చలానా రూపంలో చెల్లించానని ఆయన తెలిపారు. కొద్ది రోజులుగా భూ దాన్ ల్యాండ్ పేరుతో భూములు అక్రమించిన స్థానికేతరులు దానిని ఒక వ్యాపారంగా మార్చుకుని పక్కనే ఉన్న నా భూమిలో గుడిసెలు వేసి విక్రయిస్తూ తాను అడ్డుకుంటే అసాంఘిక శక్తులతో దాడులు చేయిస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు నా వాహనాన్ని ధ్వంసం చేశారని చట్ట ప్రకారంగా ఆ భూమిపై అన్ని హక్కులు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎప్పుడో రద్దయినా భూదాన్ ట్రస్టు బోర్డు పేరుతో ఫోర్జరీ పట్టాలు సృష్టించి పేదల మాటున లక్షలు దోచుకునే కొందరు ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అధికారులు పూర్తి విచారణ చేసి తన భూమికి రక్షణ కల్పించాలని తనపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థాన పరంగా భూమిపై అన్ని హక్కులు నాకే ఉన్నట్లు తీర్పునిచ్చారని ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులపై ఉందని తక్షణం నా పట్టా భూమిలో వేసిన గుడిసెలను తొలగించి నాకు న్యాయం చేయాలని సురేష్కుమార్ కోరారు. ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిన కారణంగా తాను ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయానని ఇకనైనా పోలీస్, రెవెన్యూ అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. మీడియా సమావేశంలో దిరిశాల వెంకటేశ్వరరావు, బండి జయకిషోర్ పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS