TEJA NEWS

-పోలీస్ కమిషనర్

ఉమ్మడి ఖమ్మం

గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్ష‌ల నేపథ్యంలో (సెప్టెంబర్-16) సోమవారం నాడు వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ , ఆర్ అండ్ బి, వైద్య విధ్యుత్ శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమీషనర్ తెలిపారు . విగ్రహాల నిమజ్జనం ప్రాంతాలలో సీసీ కెమెరాలు, బారికేడ్లను ఏర్పాటు చేసి నిరంతరం పోలీస్ నిఘాలో ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఖమ్మం డివిజన్‌లోని సుమారు ఏడు వందలు గణేష్ విగ్రహాలను రెండు ప్రాంతాలలో నిమజ్జనం చేస్తారనే అంచన వుందని తెలిపారు. సకాలంలో నిమజ్జనం ముగిసేవిధంగా ఉత్సవ కమిటీలు చొరవ తీసుకొవాలని సూచించారు. నిమజ్జనం సమయంలో ఒక్కొక్క వాహనం వేంటా ఇద్దరని మాత్రమే లోనికి అనుమతించాలని ఆదేశించారు. అన్నివర్గాల ప్రజలు సమన్వయంతో వ్యవహరిస్తూ గణేష్ నిమజ్జనం శాంతియుత వాతావరణంలో జరిగేలా తమవంతు సహకారం అందించాలని కోరారు. శోభయాత్రలో సౌండ్ సిస్టమ్ , డిజెల , లేజర్ కిరణాలు వినియోగించడం నిషిద్ధమని తెలిపారు, వాహనాల డ్రైవర్లు మద్యం, మత్తు పానీయాలు సేవించవద్దని నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గతంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రజలు, నిర్వహులు పూర్తి సహకారం అందించారని అదే స్పూర్తితో పోలీసులకు సహకరించి నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో నిమజ్జనం సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అడిషనల్ డీసీపీలు నరేష్ కుమార్ ,ప్రసాద్ రావు, విజయబాబు తో పాటు సుమారు 700 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

పోలీస్ బందోబస్తు

ఏసీపి -7, సి ఐ లు-18, ఎస్సై లు 62, ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుల్స్ -175, కానిస్టేబుల్స్-405, హోమ్ గార్డ్స్ -159 .

ఖమ్మం నగరంలో గణేష్ శోభాయాత్ర కొనసాగించవలసిన మార్గాలు

I. మామిళ్లగూడెం ఏరియా గణేష్ విగ్రహాల ఊరేగింపు మయూరిసెంటర్-కిన్నెర- జడ్పీ సెంటర్ – చర్చి కాంపౌండ్ – ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్ కు చేరుకోవాలి.

II. ఆర్టిఏ కార్యాలయం/బ్యాంక్ కాలనీ ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు ఎన్టీఆర్ సర్కిల్- ఇల్లందు క్రాస్ రోడ్డు- జడ్పీ సెంటర్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.

III. రోటరీ నగర్, ఇందిరానగర్ ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు మమత ఎక్స్ రోడ్ (వి ఆర్ కె సిల్క్స్- ఇల్లందు క్రాస్ రోడ్ – జడ్పీ సెంటర్- చర్చి కాంపౌండ్ – ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.

IV. కస్బాబజార్ మరియు కమాన్‌బజార్ ప్రాంతంలో గణేష్ విగ్రహాల ఊరేగింపు చర్చి కాంపౌండ్ ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.

V. గొల్లగూడెం మరియు శ్రీ నగర్ కాలనీ – లకారం ట్యాంక్ బండ్ ప్రాంతం నుండి గణేష్ విగ్రహాల ఊరేగింపు ట్యాంక్ బండ్- టాటా మోటార్స్-చెర్వుబజార్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.

VI. శ్రీరామ్‌హిల్స్‌, ముస్తఫానగర్‌ ప్రాంతం నుంచి గణేష్‌ విగ్రహాల ఊరేగింపు ముస్తఫానగర్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.

VII. ఖమ్మం వైరా రోడ్డు ప్రాంతం గణేష్ విగ్రహాల ఊరేగింపు జడ్పీ సెంటర్ చెర్వుబజార్- చర్చి కాంపౌండ్- ప్రకాష్‌నగర్ మున్నేరు నిమజ్జనం పాయింట్ లేదా బొక్కలగడ్డ మున్నేరు నిమజ్జనం పాయింట్.

VIII. సారధినగర్ గాంధీ చౌక్ ప్రాంతం గాంధీ నుండి గణేష్ విగ్రహాల ఊరేగింపు గాంధీచౌక్- నాయుడు సిల్క్స్- పి ఎస్ ఆర్ రోడ్- గుంటిమల్లన్న – ట్రంక్ రోడ్- నయాబజార్ మున్నేరు నిమజ్జనం పాయింట్..

గణేష్ నిమజ్జనం ఆనంతరం వాహనాల తిరుగు ప్రయాణం

రూట్ నెంబర్ – I

మున్నేరు – పంపింగ్ వెల్ రోడ్డు – త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ – హరకర బావి సెంటర్ -మూడు బోమ్మల సెంటర్ -బోస్ బోమ్మ సెంటర్ – చర్చికంపౌండ్

రూట్ నెంబర్ – II

మున్నేరు – పంపింగ్ వెల్ రోడ్డు – త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ – హరకర బావి సెంటర్ -మూడు బోమ్మల సెంటర్ -బోస్ బోమ్మ సెంటర్ – చర్చికంపౌండ్-జడ్పీ – ఇల్లందు క్రాస్ రోడ్డు – ఎన్టీఆర్ సర్కిల్ లేదా మమత సర్కిల్ మీదుగా వెళ్ళగలరు.

రూట్ నెంబర్ – III

ప్రకాష్ నగర్ మున్నేరు – సెయింట్ జోసెఫ్ సెంటర్ – చర్చి కంపౌండ్

  1. ప్రకాశనగర్ బ్రిడ్జి మరియు కాల్వఒడ్డు బ్రిడ్జిల ద్వారా ఇరువైపులా అన్నిరకాల వాహనాల రాకపోకలు గణనాదుల నిమజ్జన కార్యక్రము పూర్తయ్యేవరకు నిషేదము(రోడ్డు క్లోజ్)
  2. రాపర్థినగర్-కరుణగిరి బ్రిడ్జి ద్వారా సాధారణ వాహనములను మాత్రమే అనుమతించబడును కావున ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలని విజ్ఞప్తి.
  3. మయూరి బ్రిడ్జి మీద నుంచి నిమర్జనం సమయంలో వాహనాల రాకపోకలు నిషేధం మరియు గణనాదుల ఊరేగింపు మయూరి బ్రిడ్జి మీదుగా అనుమతించబడదు.
  4. నిమజ్జనం అనంతరం రాపర్తి నగర్, న్యూ బస్టాండ్, ఎన్టీఆర్, మమత వైపు వెళ్ళు వాహనాలు నెహ్రు సర్కిల్ నుంచి ఎఫ్ సి ఐ గౌదాం ల మీదుగా అనుమతి లేదు. అట్టి వాహనాలు కాలవొడ్డు, త్రి టౌన్ పోలీస్ స్టేషన్, మిర్చి మార్కెట్, చర్చ్ కాంపౌండ్, చెరువుబజార్, జడ్పీ, ఇల్లందు క్రాస్ రోడ్డు మీదుగా వెళ్ళగలరు.

ఖమ్మం రూరల్ మండలం నుండి గణేష్ విగ్రహాల నిమజ్జనం పాయింట్ మరియు వచ్చే మార్గాలు

  1. నాయుడుపేట, జలగంనగర్, పెద్ద తండా, సాయిప్రభాతనగర్, సాయి గణేష్ నగర్, సూర్య నగర్, కరుణగిరి, రాజీవ్ గృహకల్ప, ఏదులాపురం, ముత్తగూడెం, రెడ్డిపల్లి ప్రాంతములోని గణనాదుల నిమజ్జనము నాయుడుపేటవైపు ఏర్పాటు చేసిన మున్నేరు నది రాంప్ ద్వారా నిమజ్జనం చేయవలెను
  2. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని తీర్దాల, మంగళగూడెం, మద్దివారిగూడెం, పోలిశెట్టిగూడెం, గూడూరుపాడు, తనగంపాడు, కస్న తండ, కాచిరాజుగూడెం, ఎం.వి పాలెం, ఆరెకోడు, ఆరెకోడు తండ, వల్య తండ, పిట్టలవారిగూడెం, పోలే పల్లి, గోల్లపాడు ,పల్లెగూడెం గ్రామాల గణనాదులు తీర్థాల వద్ద మున్నేరులో నిమర్జనం చేయవలెను.
Print Friendly, PDF & Email

TEJA NEWS