TEJA NEWS

కొండకల్ రేడియల్ రోడ్ లో రెండు కార్లు డీ….. ముగ్గురికి గాయాలు

సూచిక బోర్డు లు లేకపోవడం తో వరస ప్రమాదాలు , పట్టించుకోని అధికారులు

శంకరపల్లి శంకర్ పల్లి మండలంలోని కొండకల్ మరియు మోకిల, మధ్యలో ఏర్పాటు చేస్తున్న రేడియల్ రోడ్డుపై, జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లలో ప్రయాణం చేస్తున్న ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు, స్థానికులు అందించిన సమాచారం మేరకు వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి, శంకర్ పల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి తన స్విఫ్ట్ డిజైర్ కార్ లో కొల్లూరు వైపు వెళుతూ ఉండగా, ఎదురుగా ఇద్దరు ప్రయాణికులతో వస్తున్న ఊబర్ వాహనం స్విఫ్ట్ డిజైర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది, ఉబర్ లో ప్రయాణం చేస్తున్న ఒకరికి కాలు విరుగగా మరొకరు చిన్న గాయంతో బయటపడ్డారు, స్విఫ్ట్ డిజైర్ లో ఉన్న వ్యక్తికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, రెండు వాహనాలలో ప్రయాణిస్తున్న ముగ్గురిని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు, రోడ్డుపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది, మోకిల పోలీసులు రోడ్డుపై ప్రమాదంలో ధ్వంసమైన రెండు కార్లను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్ ను పూర్తిగా క్లియర్ చేశారు, మొకిల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Print Friendly, PDF & Email

TEJA NEWS