TEJA NEWS

పాట్నాలో బుద్ధవనం స్టాల్ ను ప్రారంభించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం, బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్ పై పాట్నాలో జరుగుతున్న ట్రావెల్ ట్రేడ్ ఫేర్ లో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రారంభించారని తెలంగాణ పర్యటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. బుద్ధవనానికి ప్రాధాన్యతనిస్తూ రామప్ప దేవాలయం, గోల్కొండ కోటల ఛాయాచిత్రాల తో ఏర్పాటు చేసిన స్టాల్ ప్రారంభించిన షెకావత్, తెలంగాణలో అద్భుత పర్యాటక స్థావరాలు ఉన్నాయని, తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక స్థావరంగా అభివృద్ధి చేయడానికి తగు సహకారాన్ని అందిస్తానన్నారని రమేష్ రెడ్డి చెప్పారు. బుద్ధవనం ప్రత్యేకతలు గురించి బుద్ధవనం బౌద్ధ కన్సల్టెంట్ డా. ఈమని శివనాగిరెడ్డి వివరించగా కేంద్రమంత్రి ఆసక్తిగా విన్నారు. కేంద్ర మంత్రిని పర్యాటక సంస్థ చైర్మన్ బుద్ధవనాన్ని, ప్రముఖ పర్యాటక స్థావరలను సందర్శించాలని ఆహ్వానించగా ఆయన సానుకూలంగా స్పందించారని, తెలంగాణ పర్యాటక ప్రాజెక్టుపై చర్చించటానికి తనను ఢిల్లీకి రమ్మన్నారని ఆయన అన్నారు.


TEJA NEWS