TEJA NEWS

విజిలెన్స్ అధికారులు తనీఖిలు చేస్తే ప్రభుత్వ పెద్దలను బద్నామ్ చేస్తారా??
ధర్మపురి

మండల కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ
పెగడపల్లి మండల కేంద్రంలోని సహకార సంఘం అధ్యక్షులు పాలకవర్గ సమావేశం అని డైరెక్టర్ల ను పిలిచి అట్టి సమావేశం ఫోటోలను రాజకీయ లబ్ది కోసం వాడుకుని తప్పుడు ప్రకటన ఇచ్చినారని సంఘ అధ్యక్షులు అవకతవకలు చేయనప్పుడు విజిలెన్స్ అధికారుల తనీఖీలు పూర్తి కాకముందే కోర్ట్ కి వెళ్తామనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో పెగడపల్లి సహకార సంఘం లో ఉన్న ప్రతి రైతు ఆలోచించాలని జనరల్ బాడీ సమావేశాలు జరుపకుండా తీర్మాణాలు చేస్తూ డైరెక్టర్ లకు ఒక్క ఎజెండా పంపించి నాలుగు సమావేశాలకు సరిపడా సంతకాలు తీసుకుని ఎలాంటి సమావేశాలు పెట్టకుండా మీ ఇష్ట ప్రకారం తీర్మానాలు రాసుకుని డైరెక్టర్ ల తప్పుడు సంతకాలు చేస్తూ అవకతవకలకు పాల్పడిన మీరు వెంటనే జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి రైతులకు శ్వేత పత్రం విడుదల చేయాలని
అలాగే ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు లక్ష్మణ్ కుమార్ పైన మా ప్రభుత్వం పైన బురదజల్లాలని చూస్తే ఊరుకునేది లేదంటూ తక్షణమే ఎమ్మెల్యే గారికి భే షరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి చాట్ల విజయభాస్కర్,ఉపాధ్యక్షులు సంది మల్లారెడ్డి,మాజీ ఎంపిటిసి సభ్యులు కడారి సుప్రియ-తిరుపతి,పూసాల శోభా-తిరుపతి,సీనియర్ నాయకులు కట్ల సత్తయ్య,సింగల్ విండో డైరెక్టర్ లు తోట మల్లేశం,సురకంటి సత్తిరెడ్డి,మద్దెల సుధీర్,నాయకులు కట్ల శ్రీనివాస్,ఎలగొండ కృష్ణహరి దీకొండ మహేందర్,గర్వాందుల రాజశేఖర్,గుడివందుల సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS