TEJA NEWS

విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల కు జిల్లా తరపున అపన్న హస్తం
-పునరావాస సహాయ కార్యక్రమంలో స్వచ్ఛంద పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు
-జిల్లా నుంచి 16 వాహనాలు ద్వారా నిత్యవసర వస్తువుల వితరణ

కలెక్టరు ప్రశాంతి
రాజమహేంద్రవరం :
విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం, నగరపాలక సంస్థ, వివిధ అసోసియేషన్స్, స్వచ్చంధ సంస్థలు ద్వారా స్వచ్ఛందంగా సేకరించిన ఆహార పదార్ధాలు, వాటర్ బాటిల్స్, పాలు, బ్రెడ్, క్యాండెల్స్, అగ్గిపెట్టెలు తదితర నిత్యావసర వస్తువులను పంపుతున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.
ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వచ్ఛంధ సంస్థలు, కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. అనంతరం వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఓదార్చే మాటలు కన్నా, ఆదుకునే చేతులు మిన్న అన్న చందాన విజయవాడ ప్రజలకి తమ వంతుగా సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు వొచ్చిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుకు స్పందించి దాతృత్వం తో ముందుకు రావడం అభినందనీయం అన్నారు. అధికారులు, రైస్ మిల్లర్ల, ఐ ఎం ఎ అసోసియేషన్, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, జిల్లా తరపున వారి సహకారాన్ని కోరడం జరిగిందన్నారు. ఆమేరకు వారు ఉదాత్తంగా వ్యవహరించి ముందుకు రావడం అభినందీయం అన్నారు. ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలియ చేశారు.


జిల్లా యంత్రాంగం , నగర పాలక సంస్థ, రెవెన్యు , పౌర సరఫరాల, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర శాఖలు ఆధ్వర్యంలో స్వచ్ఛంధ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు సహాయ సహకారాలు అందజేస్తున్నారన్నారు. జిల్లా రెవిన్యూ, ఇతర శాఖలు ఆధ్వర్యంలో  26 వేల ఆహార పొట్లాలు, ఉన్న 20 వేల కొవ్వొత్తులు , 20 వేల అగ్గిపెట్టెలు, 50 వేల బ్రేడ్ ప్యాకెట్లు, 25 వేల బిస్కెట్ ప్యాకెట్ లు 2 లక్షల వాటర్ ప్యాకెట్లు, నగరపాలక సంస్థ ఆద్వర్యంలో  50 వేల బిస్కెట్ ప్యాకెట్లు, 20 వేల ఆహారపు పొట్లాలు, 20 ప్యాకెడ్ ఫుడ్, 20 వేల వాటర్ బాటిల్సు పంపడం జరిగిందన్నారు. తిరుమల విద్యా సంస్థలు తరపున 4 వేల ఫుడ్ ప్యాకెట్లు, 8 వేల వాటర్ బాటిల్స్ , మిల్లర్ల అసోసియేషన్ తరుపున 5 వేల ఆహారాలు ప్యాకెట్లు  , ఐ ఎం ఎ ద్వారా 5 వేలు, హోటల్ అసోసియేషన్ తరపున 8 వేలు, ఇస్కాన్ ద్వారా 10 వేల , డీ ఆర్ డి ఎ ద్వారా 8 వేలు, హర్లిక్స్ ఫ్యాక్టరీ ద్వారా 2500 ఆహార పొట్లాలునీ ప్రత్యేక వాహనాలు  ద్వారా పంపడం జరిగిందన్నారు.  వివిధ అసోసియేషన్స్ స్వచ్చంధ సంస్థలు, ముందుకు వొచ్చి సహాయ సహకారాలు అందజేసేందుకు అంగీకారం వ్యక్తం చేసినందున కలెక్టరు వారికి కృతఙ్ఞతలు వ్యక్త పరిచారు. నగరపాలక సంస్థ, జిల్లా పౌర సరఫరాల సంస్థ, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, వైద్య ఆరోగ్య, రెవెన్యూ ఆర్డబ్ల్యూఎస్, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర శాఖల అధికారుల సౌజన్యంతో వరద బాధితుల సహాయానికి సేకరణ చేపట్టడం జరిగిందన్నారు.
స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం వద్ద” పాల వాహనానికి” , సాయి కృష్ణ థియేటర్ వద్ద “ఫుడ్ ప్యాకెట్లు ” పంపే వాహనానికి కలెక్టర్, జెసి లు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు,  డిఆర్ఓ జి నరసింహులు, జిల్లా అధికారులు, వివిధ అసోసియేషన్స్  కిమ్స్, ఆశ, క్రిడాయి, హోటల్ అసోసియేషన్, లాబొరేటరీస్, ఐఎంఎ,  రోటరీ క్లబ్ , న్యూరో సర్జన్, ప్రవేటు స్కూల్స్ తదితర అసోసియేషన్స్ ప్రతినిధులు బి. కిషోర్ కుమార్, టి.నాగరత్నం, ఎస్. మురళీధర్, సపాధార్ ఆలీ, డాక్టర్ అరుణ రామరాజు, డాక్టర్ వైయస్ గురు ప్రసాద్, బి. శ్రీనివాసులు, ఎస్. శ్రీనివాసు , జి . రాంబాబు , పీవీపీ సత్యనారాయణ, డి భారతి , డి మోహన్ , తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS