TEJA NEWS

పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బదులు నీళ్ళు
కాకినాడ :
పెట్రోల్‌ బంక్‌ లో పెట్రోల్‌ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన దిగిన సంఘటన కాకినాడలోని జగన్నాధపురం కే సి రెడ్డి అండ్ బ్రదర్స్ హెచ్ పి పెట్రోల్ బంకు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జగన్నాధపురం హెచ్పి పెట్రోల్ బంక్ లో కొందరు ప్రయాణికులు వాహనాల్లో పెట్రోల్‌ పోయించుకున్నారు. తరువాత కాస్త దూరం వెళ్ళేటప్పటికి వారి వాహనాలు ఆగిపోవడంతో కొందరు తమ వాహనం ఏదైనా ఇబ్బంది పెట్టిందా..? అని, మరికొందరు పెట్రోల్ ఇప్పుడే కదా కొట్టిచ్చాను ఆగిపోవడం ఏంటని ఆందోళనలో పడ్డారు. అందరి వాహనాలు సరాసరి ఒకదగ్గరికి వచ్చి ఆగిపోవడంతో పెట్రోల్ పైపు ఓపెన్ చేయగా అవాక్కయ్యారు. పెట్రోల్ బదులు వాటర్ బయటకు రావడంతో ఖంగుతిన్నారు. దీంతో
వెనుతిరిగి పెట్రోల్ బంకు వద్దకు చేరుకున్నారు. దీంతో పెట్రోల్ బంక్ వద్ద ఉన్న సిబ్బందిని నిలదీశారు. బంక్‌ మేనేజర్‌ ను పిలిపించి ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా సంబంధిత యజమానులు పెట్రోల్ బంక్ వద్దకు రాకపోవడంతో సమస్యను తీవ్రతరం చేశారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బంకు వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆరా తీశారు. వాహనదారులు సంబంధిత శాఖల వారికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ ఎవరు అందుబాటులోకి రాలేదని వాపోయారు. పెట్రోల్ బంక్ యాజమాన్యం వినియోగదారుల వాహనాలను బాగు చేయించి ఇస్తానని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది.


TEJA NEWS