TEJA NEWS

నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలి

  • వ్యాసరచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం
  • చిన్నారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు హమీద్ షేక్ నిర్వర్తిస్తున్న కృషి అభినందనీయం : డాక్టర్ ప్రశాంత్

విద్యార్థులు నవ సమాజ నిర్మాతలుగా ఎదగాలని డాక్టర్ ప్రశాంత్ పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, నల్లగొండ జిల్లా ప్రఖ్యాత సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానం కార్యక్రమాన్ని శనివారం మిర్యాలగూడ పట్టణంలో డాక్టర్స్ కాలనీలోని డాక్టర్ ప్రశాంత్ దంత వైద్యశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి డాక్టర్ శిరీష తో కలిసి విజేతలకు జ్ఞాపికలను, పతకాలను ప్రదానం చేసిన అనంతరం డాక్టర్ ప్రశాంత్ మాట్లాడారు. విద్యార్థులు పట్టుదలతో కష్టపడి చదివి నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. విద్యార్థి దశ నుంచే పఠనాభిరుచులను మెరుగు పర్చుకోవాలని కోరారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం ద్వారా విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని అన్నారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీసేందుకు 20 ఏండ్ల నుంచి హమీద్ షేక్ నిర్వర్తిస్తున్న కృషి అభినందనీయం, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ప్రిన్సిపాల్ కేకే జయరాజన్, నేతాజీ హైస్కూల్ కరస్పాండెంట్ శ్రీపతి శ్రీనివాస్, శంకర్, కాతోజు సైదులు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS