TEJA NEWS

వరద ముంపుకుగురై సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలి.

… సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు

ఖమ్మం పట్టణంలోని 3 టౌన్ ప్రాంతంలో మోతీ నగర్ వెంకటేశ్వర్ నగర్ సుందరయ్య నగర్ ప్రకాష్ నగర్ జూబ్లీ పుర ప్రాంతాలలో ఇటీవల కురిసిన వర్షాలు మున్నేరు పొంగి ఈ ప్రాంతాలలో ఇళ్లను నీట ముంచింది దాని కారణంగా వందలాది కుటుంబాలు సర్వం కోల్పోయారు అనేక ప్రాంతాలు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయాయి అన్ని వస్తువులు దెబ్బతిన్నాయి సర్వం కోల్పోయిన ప్రజలకు ప్రభుత్వం వెంటనే ఆర్థిక సహకారం అందించి అండగా నిలబడాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈరోజు 35వ డివిజన్ మోతీ నగర్ ప్రాంతాన్ని సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ మోతీ నగర్ ప్రాంతంలో కాలువడు ప్రాంతంలో వెంకటేశ్వర నగర్ బొక్కలగడ్డ ప్రాంతాలు వరద ముంపుకో తీవ్రంగా ఇల్లు దెబ్బ అనేక ఇల్లు కూలిపోయాయని అనేక ఇంటి ప్రహరీ గోడలు కూలిపోయాయని ఇళ్లల్లో ప్రతి వస్తువు దెబ్బతిన్నదని కూలర్లు ఫ్రిజ్లు వంట సామాగ్రి మంచాలు పరుపులు కుట్టు మిషన్లు టీవీలు విలువైన డాక్యుమెంట్స్ పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బియ్య బస్తాలు కందిపప్పు నిత్యవసర వస్తువులు నీట మునిగి బురదలో కురుక ప్రజలకు తీవ్ర నష్టం కలిగిందని అన్నారు కనివిని జరగలేదని ఖమ్మం నగరంలో ఇంత పెద్ద ఎత్తున మొదటిసారిగా వరద ముంపు గురైందని అన్నారు జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కలెక్టర్ ఎస్పీ యుద్ధ ప్రాతిపదికపై సహకార చర్యలను చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పర్యటించిన ప్రతినిధి బృందంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల యర్రా శ్రీకాంత్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై విక్రం కళ్యాణం వెంకటేశ్వరరావు సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు త్రి టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్ రావు 35వ డివిజన్ కార్పొరేటర్ బెల్లంపల్లి వెంకట్రావు బండారు యాకయ్య బజ్జూరి రమణారెడ్డి తమ్మినేని రంగారావు ఎస్.కె అమీనా ఎస్ కే జానీ తదితరులు ఉన్నారు


TEJA NEWS