బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చెరిన అవుకు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు

బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చెరిన అవుకు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు

TEJA NEWS

అవుకు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్ రెడ్డి స్వగృహం నందు జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్న అవుకు పట్టణానికి చెందిన మిట్టికల రామచంద్రుడు, దోర్నిపాడు నారాయణ, రామస్వామి ,గుర్రాల వెంకటరాముడు, కొత్తపల్లి వెంకట రాముడు ,కట్టల కిట్టు, పసులపాడు రమణ, రామచంద్రయ్య, బలరామయ్య తదితర కుటుంబాలు టీడీపీ లో చేరారు వారికి బీసీ జనార్దన్ రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్బంగా బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో రాష్ట్రంలో మన ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతుంది, అందరం కలిసి చంద్రబాబు ని ముఖ్యమంత్రిగా చేసుకుందాము అని పిలుపునిచ్చారు. టీడీపీ లో చేరిన ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది అన్నారు.
చేరిన నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు వలెనే రాష్ట్రం మరియు బీసీ జనార్దన్ రెడ్డి వలెనే బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని, మరియు చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలతోనే ఆంధ్ర రాష్ట్రానికి నిజమైన సంక్షేమం వస్తుందని వైసీపీ ని వీడి టీడీపీలో చేరడం జరిగింది అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో మండల టిడిపి నాయకులు
గ్రామ టిడిపి శ్రేణులు, బీసీ అభిమానులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS