TEJA NEWS

ఐకెపి వివో ఏ లను షర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాల నీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా
రాజకీయ కక్షలతో తొలగించిన వివో ఏ లను విధుల్లోకి తీసుకోవాలి…… సిఐటి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజుడిమాండ్
వనపర్తి :
ఐకెపి వివో ఏ ఉద్యోగులను షర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా అధ్యక్షులు వి వెంకటయ్య అధ్యక్షు తన పాలకేంద్రం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి కలెక్టరేట్ ఎదుట వివో ఏ లు ధర్నాను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వి వో ఏ లను షర్ఫు ఉద్యోగులుగా గుర్తించి గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ఇవ్వాలని ఆన్లైన్ మీటింగ్లు రద్దు చేయాలని డ్రెస్ కూడా అమలు చేయాలని తొలగించిన ఐకెపి వివో ఏ లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించాలని ప్రమాద బీమా మరియు ఆరోగ్య బీమా కల్పించాలని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న ఐదు నెలల వేతనాలు ఆత్మకూరు వివో లకు వెంటనే చెల్లించాలని శ్రీనిధి నుండి ఇన్సెంటివ్ త్వరగా విడుదల చేయాలని అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొబ్బిలి నిక్సన్ సిఐటియు జిల్లా నాయకులు నందిమల రాములు ఐకెపి వివో ఏ ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఈశ్వరమ్మ జిల్లా కోశాధికారి దేవేందర్ జిల్లా కోశాధికారి దేవేందర్ జిల్లా ఉపాధ్యక్షులు రాజా గౌడ్ ఈశ్వర్ అలివేల దర్శయ్య రమేష్ పావని రాజేశ్వరి కురుమయ్య రాములు బాలరాజు అల్లి భాష తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS