విజయనగరం జిల్లా పోలీసు
గంజాయి అక్రమ రవాణ కేసులో 10మంది నిందితులు అరెస్టు
- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
నలుగురు నిందితుల నుండి 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న 2వ పట్టణ పోలీసులు
గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వారిపై సస్పెక్ట్ షీటు ఓపెన్ చేసి, వారిపై నిఘా పెట్టనున్న పోలీసులు
గంజాయి సేవించిన ఆరుగురు యువకులను అదువులోకి తీసుకున్న భోగాపురం, టూ టౌన్ పోలీసులు
టాస్క్ఫోర్స్ పోలీసులకు 8712644836కు గంజాయి సమాచారాన్ని అందించాలని కోరిన జిల్లా ఎస్పీ*
గంజాయి విక్రయాల్లో ప్రధాన సూత్రదారులను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేస్తామన్న జిల్లా ఎస్పీ
విజయనగరం పట్టణం బాబామెట్ట నుండి డబుల్ కాలనీకి వెళ్ళే దారిలో గంజాయి అక్రమంగా కలిగిన నలుగురు నిందితులను, గంజాయి సేవించిన మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి 10కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, నిందితులను రిమాండుకు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆగస్టు 9న తెలిపారు. విజయనగరం 2వ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారంతో విజయనగరం 2వ పట్టణ సిఐ కే.రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐ మురళి, సిబ్బంది ఆగస్టు 8న పట్టణంలోని బాబామెట్ట నుండి డబుల్ కాలనీకి వెళ్ళే రహదారిలో ఆకస్మిక తనిఖీలు చేపడుతుండగా గంజాయి కలిగిన నలుగురు వ్యక్తులు పోలీసులను చూచి, పరారీ అవుతుండగా,వారిని అదుపులోకి తీసుకొన్నారన్నారు. పట్టుబడిన నలుగురు నిందితుల్లో (ఎ-1) శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన పటాన్ భాషా అలీ (25సం.లు) అనే వ్యక్తి గత రెండు సంవత్సరంలుగా బాబామెట్టలో నివాసం ఉంటున్నట్లు, గంజాయిని ఒడిస్సా రాష్ట్రం అరకు సమీపంలోని కించుమండ సంతలోని గుర్తు తెలియని వ్యక్తి వద్ద 10కిలోల గంజాయి కొనుగోలు చేసి, వాటిని ఇతరులకు విక్రయించే క్రమంలో పోలీసులకు పట్టుబడినట్లుగా విచారణలో అంగీకరించారని జిల్లా ఎస్పీ తెలిపారు. (ఎ-1) పటాన్ భాషా అలీ పై ఇది వరకే గంట్యాడ పోలీసు స్టేషనులో ఒక గంజాయి కేసు, బాపట్ల జిల్లాలో ఒక గంజాయి కేసు ఇప్పటికే ఉన్నాయని, నేడు 2వ పట్టణ పోలీసు స్టేషనులో కూడా మరో కేసు నమోదైందని, ఈ కేసులో అతని వద్ద నుండి 4కిలోల గంజాయిని 2వ పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు.
పట్టుబడిన మిగిలిన ముగ్గురు నిందితుల్లో (ఎ-2) షేక్ కాశీషా (20సం.లు) (ఎ-3) పాత్రో మారయ్య (21సం.లు) లు విజయనగరం పట్టణంకు చెందగా, (ఎ-4) భోగాపురంకు చెందిన తూతిక శ్యామ్ (19సం.లు)ఉన్నారన్నారు. ఎ-2, ఎ-3, ఎ-4 నిందితులు ఎ-1 పటాన్ భాషా అలీ వద్ద నుండి రెండేసి కిలోల చొప్పున కొనుగోలు చేసినట్లుగా విచారణలో అంగీకరించారని జిల్లా ఎస్పీ తెలిపారు. విజయనగరం 2వ పట్టణ పోలీసులు డిప్యూటీ తాశీల్దార్ సంజీవరావు మరియు ఇద్దరు విఆర్వోల సమక్షంలో 10కిలోల గంజాయిని సీజ్ చేసి, నిందితులను రిమాండుకు తరలించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులను మరింత లోతుగా విచారణ చేసి, గంజాయి కేసులో అసలైన సూత్రదారులను కూడా త్వరలో పట్టుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అదే విధంగా విజయనగరం జిల్లా భోగాపురం పోలీసు స్టేషను పరిధిలో గంజాయిని సేవిస్తున్న నలుగురు ఇంజనీరింగు, డిప్లమా, హెూటల్ మేనేజ్మెంటు మరియు డిగ్రీ చదువుతున్న విద్యార్థులను, విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషనులో పరిధిలో ఇద్దరు గంజాయి సేవించిన యువకులను అదుపులోకి తీసుకొని, వారిపై కేసులు నమోదుచేసినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. వీరికి గంజాయి విక్రయించిన వ్యక్తులను కూడా గుర్తించి, వారిపై కూడా కేసులునమోదు చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేసారు. గంజాయి సేవించినా, రవాణ చేసినా, చిన్న మొత్తాల్లో విక్రయించినా వారిపై కేసులు తప్పవని, ఇదే తరహా నేరంకు మళ్ళీ రెండోసారి పాల్పడితే వారిపై హిస్టరీ షీటు ఓపెన్చేసి, వారిపై నిఘా పెడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయం,
విజయనగరం.