శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపము ఆవిష్కరణ.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023.
మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్నారు. బాబా వారికి హారతులు ఇచ్చి ఘనంగా పూజలు చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా సేవాశ్రమము ఆధ్వర్యంలో మైలవరం మండలంలోని గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపమును ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాబా వారి ట్రస్ట్ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ఆశ్రమంలోని శ్రీ సాయినాథుని ఆలయానికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు విచ్చేశారు. బాబా వారి విగ్రహాన్ని దర్శించి, సాయిపాదుకల వద్ద టెంకాయ కొట్టి పూజల్లో పాల్గొన్నారు. సాయి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. సాయిబాబా బోధనలో ప్రేమ, కరుణ, దానం, సంతృప్తి, శాంతి, దైవారాధన, గురుపూజ ముఖ్యమైనవని, సాయిబాబా బోధనలను ఆచరించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.