TEJA NEWS

కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో ఏపీ స్పీకర్

ఏపీ రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార,సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.

ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వకామన్వెల్త్ పార్లమెంటరీ మహా సభల్లో ‘ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ’ అంశంపై సాగిన చర్చలో ఆయన మాట్లాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉత్తమ విధానాలను స్వీకరించేందుకు ఏపీ సిద్ధమన్నారు. త్వరలోనే కాగిత రహితకార్యకలాపాలకు చర్యలు తీసుకుంటామని వివరించారు.


TEJA NEWS