వైసిపి నేత, నటుడు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదు?
అమరావతి:
ప్రముఖ నటుడు,వైసీపీ హయాంలో ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించిన నేత,నటుడు పోసాని కృష్ణ మురళి పై మరో కేసు నమోదైంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి నారా లోకేష్ పై చేసిన అనుచిత వాఖ్యలపై కడప జిల్లాలోని రిమ్స్ పోలీస్ స్టేషన్లో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు భాస్కర్, జనసేన, ఆంధ్ర జోన్ కన్వీనర్ భూడిద శంకర్, లు కంప్లైంట్ చేశారు.
ఇప్పటికే రాజంపేట పోలీస్ స్టేషన్లోనూ వీరు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. టీడీపీ, జనసేన నేతలు పోసానిపై వరుస ఫిర్యాదులు చేస్తున్నారు.
ఇప్పటివరకు మొత్తం పోసాని మీద 50కి పైగా ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. అలాగే అనంతపురంలో పోసాని దిష్టి బొమ్మను సైతం తెలుగు యువత, ఎస్సీ సెల్ నాయకులు దహనం చేశారు.
ఈ మేరకు నమోదైన కేసులో విచారణకు హాజరు కావాలని పోసానికి రెండు మూడు రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.