TEJA NEWS

మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని కీసర మండల కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో జరిగిన భారత రాష్ట్ర సమితి 23వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా పాల్గొని, జెండా ఆవిష్కరణ చేసిన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి .. మరియు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరి మల్లారెడ్డి . అనంతరం పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరడం జరిగింది.

గులాబీ జెండాను ఎగరవేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ 27 వ తారీఖున జలదృశ్యంలో కొద్దిమంది వ్యక్తులతో ఉద్యమ నేత తెలంగాణ బాపు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించడం జరిగింది.అని అన్నారు పార్టీని స్థాపించిన తొలి రోజుల్లో సమైక్యాంధ్ర వలస పాలకులు మరియు తెలంగాణ ద్రోహులు కెసిఆర్ ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని, అవమానించారని,అన్ని రకాల అవమానాలను తట్టుకొని తెలంగాణ ఉద్యమం కోసం అహర్నిశలు కష్టపడి సబ్బండ వర్గాలను ఏకతాటిపై తీసుకొచ్చి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణను సాధించడం జరిగిందని,తెలంగాణను సాధించే క్రమంలో ఎందరో అమరులయ్యారని, అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణా ను బంగారు తెలంగాణా గా మార్చి అన్ని వర్గాల జీవితాలలో వెలుగు ను నింపిన మహోన్నత వ్యక్తి కెసిఆర్ ని అన్నారు. సుమారు 65 లక్షల మంది సభ్యత్వాలతో దేశం లోనే బలం గా ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ అని జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో BRS పార్టీ 10 నుండి 12 పార్లమెంట్ స్థానాలను గెలవబోతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో.. బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు,ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS