రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం
-స్పందించిన జిల్లా కలెక్టర్
-తక్షణ వైద్య సహాయం అందించేలా జి.ఎస్.ఎల్ ఆసుపత్రి వైద్యులకు సూచనలు
రాజానగరం :
రాజానగరం నియోజకవర్గ పరిధిలో అకస్మిక తనిఖీలలో భాగంగా క్షేత్ర స్థాయిలో పర్యటనలో ఉన్న జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజానగరం జాతీయ రహదారిపై లారీ మోటార్ సైకిల్ ను ఢీకొన్న ఘటనలో గాయాల పాలైన ముగ్గురికి తక్షణ వైద్యం అందించేందుకు 108 ఫోన్ చేయడం జరిగింది. క్షత్రగాత్రులను అంబులెన్స్ ద్వారా జి ఎస్ ఎల్ ఆసుపత్రి కి పంపడం జరిగింది.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు జిఎస్ఎల్ ఆసుపత్రి వర్గాలతో ఫోన్లో సంప్రదించి తగిన వైద్య సేవలు అందించవలసిందిగా సూచించడం జరిగింది. జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవడంతో పాటు ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి వాహన చోదకులకు విజ్ఞప్తి చేశారు.
రాజానగరం జాతీయ రహదారిపై ప్రమాదం
Related Posts
డిఆర్ఓ గా మురళి
TEJA NEWS సాక్షిత న్యూస్ : పల్నాడు జిల్లా డిఆర్ఓ గా మురళి పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి గా మంగళవారం మురళి బాధ్యతలు చేపట్టారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన నరసరావుపేటకు వదిలి అయ్యారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్…
పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు
TEJA NEWS పైడివాడ అగ్రహారం రెవెన్యూ పరిధిలో రెవెన్యూ సదస్సు పైడివాడ అగ్రహారం గ్రామ రెవిన్యూ పరిధిలో ఈరోజు రీ- సర్వే మరియు ఇతర భూ సమస్యల పరిష్కారం కొరకై గ్రామసభ నిర్వహించారు. ఈ రెవిన్యూ సదస్సులతో భూ సమస్యలకు పరిష్కారం…