క్రిటికల్ కేసుల విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
-వైద్య సేవలు అందించిన వాటి వివరాలు కేర్ షీట్ లో నమోదు చెయ్యాలి
-మరణాలు సంభవించ కుండా నివారించే ముందస్తు వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాలి
-సరైన చికిత్సా అందించే ఆసుపత్రికి సిఫార్సు చెయ్యండి
-జిల్లాలో మాతృ, శిశు మరణాలపై ఆర్డీవో తో విచారణ చేపట్టడం జరుగుతుంది- కలెక్టర్ పి ప్రశాంతి
……..
రాజమహేంద్రవరం :
మాతృ, శిశు మరణాలు నివారణలో క్లినికల్ పరిశీలనలు, సిఫార్సు లు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని, క్రిటికల్ కేసుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ పి.ప్రశాంతి స్పష్టం చేశారు. హైరిస్క్ కేసుల విషయంలో కేర్ షీట్ లో వైద్య ఆరోగ్య స్థితి మరణాల నివారణకు అందించిన చికిత్సా వివరాలు నమోదుకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో ఐఎమ్ఆర్, ఎంఎంఆర్,
మరణాలపై సమగ్రంగా సంబంధిత కమిటి సభ్యులు, మెడికల్ ఆఫీసర్, ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్, అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాలో మాతృ మరణాలు, శిశు మరణాలు సంభవించడం కుండా ఆయా కేసుల ఆరోగ్య స్థితి గతుల తీవ్ర ఆందోళన కలిగించే అంశం అన్నారు. వైద్యులు, ఇతర అనుబంధ శాఖల సిబ్బంది అప్రమత్తం వ్యవహరిస్తూ, ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకోవడం ద్వారా తప్పకుండా మరణాలు సంభవించకుండా నివారణ సాధ్యం అన్నారు. క్రిటికల్ కేరింగు తీసుకునే వాటి విషయంలో అత్యంత కీలకమైన పాత్రను డాక్టర్లు వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సమీక్షలో భాగంగా పి హెచ్ సి లు ధవళేశ్వరం, పాలచెర్ల పరిథిలో సంభవించిన మాతృ మరణాలు పై సమగ్రంగా ప్రశ్నలు అడిగారు. జిల్లాలో రెండు మాతృ మరణాలు, 22 శిశు మరణాలు సంభవించడం దురదృష్టకరమన్నారు. మరణాలు నివారించే అవకాశం ఉన్నా, వైద్య పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం నిర్లక్ష్యం, నిర్లిప్తత కారణం గా ఆయా మరణాలు సంభవించడం కారణంగా పేర్కొన్నారు. తల్లుల, పిల్లలకి దశల వారిగా వారికి అందచేసిన వైద్య సేవలు, వైద్యులు గుర్తించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమేరకు కేర్ షీట్ లో వివరాలు నమోదు చెయ్యడం, క్రిటికల్ కేసుల విషయములో కేరింగ్ అవసరం అన్నారు. తదుపరి వారి ఆరోగ్య స్థితి గతుల ఆధారంగా ఏ ఆసుపత్రిలో సిఫార్సు చెయ్యాలో అక్కడికే సిఫార్సు చేస్తూ, సంబంధిత వైద్యులతో కేసు యెుక్క ఆరోగ్య స్థితి వివరించడం ద్వారా తక్షణమే వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందన్నారు. వైద్యం చేసిన కేర్ షీట్ లో స్పష్టత లేకపోవడం, దిద్దివేతలు ఉండడం పై కలెక్టర్ ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో 22 శిశు మరణాలు సంభవించడం పై ఆర్డీవో విచారణ చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్, ఏ ఎన్ ఎం, పీ హెచ్ సి , సీ హెచ్ సి వరకూ ఆయా తల్లుల, పిల్లల ఆరోగ్య స్థితి గతుల గుర్తించి, వాటి వివరాలు ఎమ్ సి హెచ్ కార్డులో రికార్డు చెయ్యాల్సి ఉంటుందన్నారు. ప్రవేటు ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రులలో సిసి కెమెరా లు పనిచేసేలా చూడాలన్నారు. హై రిస్క్ కేసుల విషయములో జాప్యం తగదని, ఎప్పటికప్పుడు ఆరోగ్య స్థితి, అందచేస్తున్న వైద్యం వివరాలు తప్పనిసరిగా బాధ్యత కలిగి నమోదు చెయ్యడం, వేరే ఆసుపత్రికి పంపే సందర్భాల్లో ఆయా వివరాలు అందించడం తప్పనిసరి అని తెలిపారు. పరిస్థితి తెలిసినా, ఈ విషయములో నిర్లక్ష్యం వహించిన యెడల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గోల్డన్ ఆవర్ లో చికిత్సా అందజేసేందుకు, జాప్యం నివారణ చర్యలు లో భాగంగా సరైన చికిత్సా అందించే ఆసుపత్రికే సిఫార్సు చెయ్యల్సి ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో కమిటీ సభ్యులు డిఎంహెచ్వో డా కే వెంకటేశ్వరరావు, డీ సీ హెచ్ ఎస్ డా ఎన్పి పద్మశ్రీ, , డీ ఐ ఒ డా ఎన్. రాజకుమారి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గైనిక్ డా అక్కమాంబ, జనరల్ మెడిసిన్ డా విజయ్ బాబు , అనస్థీషియా డా మహిందర్, పీడియాట్రిక్ డా మోహన్ చంద్రశ్రీ, బ్లడ్ బ్యాంకు ప్రతినిధి డా సుజాత, పీ హెచ్ సి , సీ హెచ్ సి వైద్యులు, ఆశా వర్కర్, ఏ ఎన్ ఎం, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.